Narendra modi: ప్రధాని మోడీకి అత్యంత ఇష్టమైన ఫుడ్స్ ఏంటో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17వ తేదీన 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. మరి.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మోడీకి ఇష్టమైన ఆహారాలు ఏంటి..? వీటితో పాటు... ఆయన డైట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం...

PM Modi Birth Day
ప్రధాని నరంద్ర మోదీ.. వయసు 75 ఏళ్లు నిండినా.. ఆయన మాత్రం చాలా చురుకుగా ఉంటారు. రోజంతా ఎంతో బిజీగా ఉండే ఆయన.. తన ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఫిట్‌నెస్, ఆహారం, యోగా, వ్యాయామం, క్రమశిక్షణా జీవనశైలి ఆయన ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం అని చెప్పొచ్చు. ఆయనకు నచ్చిన, ఆయన మెచ్చిన కొన్ని ఫుడ్స్ జాబితా ఇక్కడ ఉంది..
పాలకూర పరోఠా...
మోడీకి అత్యంత ఇష్టమైన ఆహారాల్లో పాలకూర పరోఠా ఒకటి. సెప్టెంబర్ 2020లో, ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి స్వయంగా ఒక సంభాషణలో పాలకూర పరాఠా గురించి ప్రస్తావించారు, తాను ఇప్పటికీ వారానికి ఒకటి లేదా రెండుసార్లు దానిని తింటానని చెప్పారు.
శ్రీఖండ్
ప్రధానమంత్రి మోడీకి ఇష్టమైన స్వీట్ శ్రీఖండ్. ఇది పెరుగుతో తయారు చేసే సాంప్రదాయ తీపి వంటకం, దీనికి రుచి.. ఏలకులు , కుంకుమపువ్వు వంటి పదార్థాలతో రుచి ఉంటుంది. శ్రీఖండ్ రుచి చాలా టేస్టుగా ఉంటుంది. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. పండుగలు , ప్రత్యేక సందర్భాలలో దీనిని ఎక్కువగా తింటూ ఉంటారు.
ఢోక్లా..
ప్రధాని మోడీ ధోక్లా అంటే కూడా చాలా ఇష్టం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, జీర్ణం కావడం కూడా సులభం. ఢోక్లాలో శనగ పిండి, పెరుగు, తేలికపాటి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోడీ ఇంట్లో ఉన్నప్పుడల్లా, ఆయన ఈ గుజరాతీ చిరుతిండిని తన ప్లేట్‌లో చేర్చుకుంటారు.
కిచిడీ...
పప్పు, బియ్యం కాంబినేషన్ తో తయారు చేసిన ఆహారం ఇది. ఈ కిచిడీ కూడా మోడీకి చాలా ఇష్టమైన వంటకం. ఇది చాలా తేలికగా.. జీర్ణం అవ్వడమే కాకుండా... శరీరానికి అవసరం అయిన పోషకాలు అందేలా చేస్తుంది. అందుకే మోడీ దీనిని సూపర్ ఫుడ్ అని చెబుతుంటారు. ఉపవాసం తర్వాత కూడా.. ఆయన ఈ కిచిడీని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.