పుట్టగొడుగుల కూరను తింటే జరిగేది ఇదే
పుట్టగొడుగుల కూర చాలా టేస్టీగా అవుతుంది. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నిజానికి ఈ పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.

పుట్టగొడుగుల ప్రయోజనాలు
పుట్టగొడుగులు చూడటానికి చిన్నగా ఉన్నా.. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ బి కూడా దీనిలో మెండుగా ఉంటుంది.
పుట్టగొడుగుల ప్రయోజనాలు
పుట్టగొడుగుల్లో విటమిన్ బి2, విటమిన్ బి3, వంటివి ఉంటాయి. వీటిని తింటే మీకు ఈ పోషకాల లోపాలు తొలగిపోతాయి. ఈ విటమిన్ బి3 నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి అవసరం. మార్నింగ్ సిక్ నెస్ ను, అలసటను తగ్గించడానికి పొట్టగొడుగులు ఎంతగానో సహాయపడతాయి.
పుట్టగొడుగుల ప్రయోజనాలు
పుట్టగొడుగుల్లో సెలీనియం అనే ఖనిజం మెండుగా ఉంటుంది. ఇది సీ ఫుడ్, మాంసంలో మాత్రమే పుష్కలంగా ఉంటుంది. ఇది మన కణాలను రక్షిస్తుంది. అలాగే దీనిలో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
పుట్టగొడుగుల ప్రయోజనాలు
కండరాలను బలంగా ఉంచడానికి పొటాషియం చాలా అవసరం. అయితే ఈ పొటాషియం అరటిపండ్లలోనే ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటుంటాం. కానీ ఇది పుట్టగొడుగుల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ద్రవాలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కండరాల నొప్పులుంటే మీ శరీరంలో పొటాషియం లోపం ఉన్నట్టే.
పుట్టగొడుగుల ప్రయోజనాలు
మన శరీరం ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కావడానికి, ఐరన్ ను ప్రాసెస్ చేయడానికి కాపర్ అవసరపడుతుంది. అయితే పుట్టగొడుగుల్లో ఇనుము, సెలీనియంతో పాటుగా కాపర్ కూడా మెండుగా ఉంటుంది. ఇవి తింటే మీ శరీరానికి మల్టీ విటమిన్లు అందుతాయి.
పుట్టగొడుగుల ప్రయోజనాలు
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యం, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మన వయసు పెరిగే కొద్ది మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లితో పుట్టగొడుగులను వేయించి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట.
పుట్టగొడుగుల ప్రయోజనాలు
పుట్టగొడుగుల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వీటిని తింటే సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే దీనిలో బీటా-గ్లూకాన్స్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులకు మద్దతునిస్తుంది. అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కడుపు సమస్యలు రాకుండా కాపాడుతుంది.