Chapati:ఈ చపాతీలు తింటే బరువు, షుగర్ రెండూ తగ్గుతాయి
మీరు రోజూ తినే చపాతీ పిండిలో కొన్ని రకాల పిండిని కలిపి తింటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ రొట్టెలు మీ బరువును, షుగర్ ను రెండింటినీ తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

roti
నిజానికి అన్నం కంటే రొట్టెలే ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. మనల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి. అయితే మీరు తినే చపాతీ పిండిలో కొన్ని రకాల పిండిని కలిపి తింటే మీరు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రొట్టె పిండికి ఏయే పిండిని కలపాలి?
బార్లీ పిండి
బార్లీ పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మీరు అతిగా తినకుండా ఉంచుతుంది. అలాగే మీరు కేలరీలు తీసుకోవడం కూడా తగ్గుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బార్లీ పిండిలో ఉండే బీటా గ్లూకాన్ మీ బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది. కాబట్టి ఇది డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచిది.
శెనగ పిండి
శెనగ పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి బాగా సహాయపడుతుంది. అలాగే మన జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మీ బ్లడ్ షుగర్ ను ఫాస్ట్ గా పెంచదు. ఈ పిండిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ మీరు బరువు తగ్గడానికి, షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.
రాగి పిండి
రాగులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఫైబర్, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే వీటిలో గ్లూటెన్ ఉండదు. మన శరీరానికి అవసరమైన అమైనోమ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రాగి పిండి చాలా స్లోగా జీర్ణం అవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్ గా పెరగవు. అలాగే కడుపు కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి బాగా సహాయపడుతుంది.
పిండిని ఎలా కలపాలి?
మీ ఈ మూడు రకాల పిండిని సమాన మొత్తంలో తీసుకుని కలుపుపోవచ్చు. లేదా మీకు నచ్చిన క్వాంటిటీని తీసుకోవచ్చు. ఉదాహరణకు అరకప్పు బార్లీ పిండి, అరకప్పు రాగిపిండి, అరకప్పు శెనగపిండిని 1 కప్పు గోధుమపిండిలో కలుపుకోవచ్చు. ఈ పిండితో చేసిన చపాతీలు టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి.