కోక్ కు మసాలా దట్టించండి.. నాలుకకు కొత్త టేస్ట్ రుచి చూపించండి..
లాక్ డౌన్.. ఇంట్లోనుంచి కాలు బయట పెట్టలేం.. అలాగని ఇంట్లోనే బోర్ గా కూర్చోలేం.. రుచులకు అలవాటు పడ్డ జిహ్మను ఆపలేం.. ఏదైనా మాంచి మసాలా డిష్ తినాలనిపిస్తుంది. లేదా పబ్ లో దొరికే మసాలా కోక్ అయినా తాగాలనిపిస్తుంది. మరెలా..?

ఇంట్లో మసాలా కోక్ ఎలా తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మా దగ్గరుంది పరిష్కారం. తియ్యగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నోరు ఇష్టపడకపోతే ఈ మసాలా కోక్ ను ట్రై చేయండి. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు. అంతేకాదు క్షణాల్లో రెడీ అయి.. మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది.
మసాలా కోక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
2 కప్పుల కోక్
1/4 టీస్పూన్ నల్ల ఉప్పు
చిటికెడు ఉప్పు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర
1 టీస్పూన్ చాట్ మసాలా
4 ఐస్ క్యూబ్స్
మసాలా కోక్ తయారు చేసే విధానం..
ముందు ఒక మిక్సింగ్ బౌల్ లో కోక్ కాకుండా మిగతా అన్ని పదార్థాలూ వేసి.. బాగా కలపండి. ఇప్పుడు ఈ మసాలాను రెండు గ్లాసుల్లో సమానంగా వేయండి.
ఆ తరువాత గ్లాసుల్లో కోక్ పోయండి. ఆ తరువాత దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసి.. స్టిర్ తో కలపండి. వెంటనే దీన్ని పబ్ గ్లాస్‌లో పోసి సర్వ్ చేయండి.
ఈ మసాలా కోక్ లో కొత్తిమీర నచ్చకపోతే దాన్ని అవాయిడ్ చేయచ్చు.
మీ డ్రింక్ లో సోడియం తక్కువగా ఉండాలనుకుంటే సాధారణ ఉప్పును వదిలేసి నల్లుప్పును మాత్రమే వాడొచ్చు.