లంచ్ లో ఏం తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?
మధ్యాహ్నం ఏవి పడితే అవి తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. లంచ్ లో మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.
మధ్యాహ్న భోజనంలో కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలి. ముఖ్యంగా మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు. ఇవి మన శరీరానికి రోజుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాదు కండరాల పనితీరును మెరుగుపర్చడానికి, ఎనర్జీ లెవెల్స్ ను పెంచడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే మధ్యాహ్నం పూట ఏవి పడితే అవి తినకుండా.. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సాల్మన్
సాల్మన్ చేపలను మధ్యాహ్నం పూట తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. సాల్మన్ చేపల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లను కూడా మన శరీరానికి అందిస్తాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపర్చడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
చిక్పీస్
చిక్పీస్ లో కూడా మెగ్నీషియం, ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా బాగా సహాయపడతాయి.
అరటి
అరటి పండ్లను కూడా మధ్యాహ్నం పూట తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లను తింటే కండరాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
soaked almonds
నానబెట్టిన బాదం పప్పులు
బాదం పప్పులను మధ్యాహ్నం పూట తింటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. బాదం పప్పుల్లో ఫైబర్, మెగ్నీషియంతో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నానబెట్టిన బాదం పప్పులను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
ఆకుకూరలు
ఆకు కూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూరలో ఇనుము, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అవొకాడో
అవొకాడో ఒక ఆరోగ్యకరమైన కూరగాయ. అవొకాడోలో మెగ్నీషియం, పొటాషియం, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడును ఆరోగ్యం ఉంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
బీన్స్
బ్లాక్ బీన్స్ లో మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫుడ్ జీర్ణం కావడానికి సహాయపడుతుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడి గింజలను కూడా మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తినాలి. గుమ్మడి కాయ గింజల్లో జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ మన ఆరోగలో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనిని మితంగా తీసుకోవడం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.