Lunch Box:లంచ్ బాక్స్ లో ఈ ఐదు.. మిమ్మల్ని ఆరోగ్యంగా మారుస్తుంది..!
మనం వెంట తీసుకువెళ్లే లంచ్ బాక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... మనం ఎలాంటి వైరస్ లు, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. పరిశుభ్రత, పోషకమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ని అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ స్కూల్లు, కాలేజీలు, ఆఫీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. గత రెండేళ్లుగా.. కరోనా మహమ్మారి కారణంగా.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పిల్లల చదువులు ఆన్ లైన్ లో సాగిపోగా.. పెద్దలు తమ ఉద్యోగాలు ఇంటి నుంచే పూర్తి చేస్తారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణం అవుతుండటంతో.... మళ్లీ స్కూల్లు, ఆఫీసులు తెరవడం మొదలుపెట్టారు. కాగా.. మళ్లీ స్కూల్లు, కార్యాలయాలు తెరచినా...కరోనా లాంటి మహమ్మారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. అది లంచ్ బాక్స్ తోనే సాధ్యమని చెబుతున్నారు.
మనం వెంట తీసుకువెళ్లే లంచ్ బాక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... మనం ఎలాంటి వైరస్ లు, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. పరిశుభ్రత, పోషకమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ని అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.
Lunch box
కోవిడ్, ఇతర ఇన్ఫెక్షన్ల దృష్ట్యా ఇక్కడ కొన్ని లంచ్‌బాక్స్ సంబంధిత చిట్కాలు ఉన్నాయి, ఇవి మీకు సరైన భోజనాన్ని పొందడంలో సహాయపడతాయి. అదేవిధంగా రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయి. ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం..
లంచ్ బాక్స్ మాత్రమే కాదు.. లంచ్ బ్యాగ్ సిద్ధం చేయండి..
చాలా మంది నాజుకుగా.. కేవలం ఒక్క లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ.. అలా కాకుండా మీరు లంచ్ బ్యాగ్ తీసుకువెళ్లడం ప్రారంభించాలి. అందులో.. మధ్యాహ్నం లంచ్ తో పాటు.. సాయంత్రం స్నాక్స్, మంచి నీటి బాటిల్, ఏదైనా జ్యూస్ పట్టేవిధంగా ఒక మీడియం సైజు లంచ్ బ్యాగ్ సిద్ధం చేసుకోవాలి.
ఇక లంచ్ బాక్స్ రోజూ తీసుకువెళ్లి తింటే.. బరువు పెరుగుతాం అని భయపడేవారు చాలా మంది ఉన్నారు. లేదంటే.. చాలా తక్కువ ఆహారాన్ని లంచ్ బాక్స్ లో తీసుకువెళుతూ ఉంటారు. కానీ.. బరువు విషయాన్ని పక్కన పెట్టి.. ఆరోగ్యం విషయంలో దృష్టి పెట్టాలి.
కచ్చితంగా బాక్స్ లో అన్నం లేదంటే.. రెండు రోటీలు పెట్టాలి. దానిలోకి ఏదైనా కారగూయల కూర, పప్పు, కొద్దిగా సలాడ్ ని పెట్టుకోవాలి. మీ ఆకలిని బట్టి.. దానిలోకి ఇతర ఆహారాలను జోడించుకోవచ్చు. ఏదైనా ఫ్రూట్స్, లేదంటే డ్రైఫ్రూట్స్ లాంటి వాటిని కూడా బాక్స్ లో పెట్టుకోవచ్చు.
స్నాక్స్ మర్చిపోవద్దు..
లంచ్ తో పాటు స్నాక్స్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది స్నాక్స్ లాంటి వాటిని ఆఫీసుకు దగ్గరలో ఉన్న కేఫ్ లలో తినడానికి ఇష్టపడతారు.
దానికి బదులు ఇంటి నుంచే స్నాక్స్ తీసుకు వెళ్లడం ఉత్తమమైన మార్గం. బయట తయారు చేసే వాటిలో పోషకాలు, శుభ్రత ఉండకపోవచ్చు. అదే ఇంటి నుంచి పోషకాలు ఉన్న స్నాక్స్ తీసుకు వెళ్లడం మంచిది. స్నాక్స్ గా మీకు నచ్చిన దానిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
వాటర్ బాటిల్..
స్కూల్, కాలేజ్, ఆఫీసు లలో వాటర్ అందుబాటులో ఉంటాయి. ఈ విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ లంచ్ బ్యాగ్ లో.. ఒక వాటర్ బాటిల్ ని మీరు క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి. చేతిలో వాటర్ బాటిల్ ఉండటం వల్ల.. మనకు సరిపడా వాటర్ తీసుకునే అవకాశం ఉంటుంది. బాటిల్ అయిపోయిన ప్రతిసారి రీఫిల్ చేసుకోవచ్చు. శరీరానికి నీరు ఎక్కువగా అవసరం. ఈ విషయం మర్చిపోవద్దు. చాలా మందికి పక్కన ఉంటే వాటర్ తాగుతారు.. కానీ వెళ్లి తాగాలి అంటే బద్దకంగా ఫీలౌతారు. అలాంటివారు కూడా బాటిల్ క్యారీ చేయడం మంచిది. వాటర్ తీసుకోకపోతే శీరరం డీ హైడ్రేట్ అవుతుందని గుర్తుంచుకోవాలి.
ఇక కేవలం వాటర్ మాత్రమే కాకుండా..లస్సీ, మజ్జిగ, బట్టర్ మిల్క్ లాంటి వాటిని కూడా తీసుకువెళ్లడం మంచిది. లేదంటే డీటాక్స్ వాటర్ కూడా తీసుకువెళ్లవచ్చు. నాలుకకు రుచిని అందించడంతో పాటు... శరీరానికి పోషణ కూడా అందుతుంది.
కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
లంచ్ లోకి కాలానుగుణంగా లభించే కూరగాయలను తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ కూరగాయలు మీకు సరైన పోషణ, ప్రోటీన్లను అందజస్తాయి. ప్రతిరోజూ పప్పు కూడా తీసుకోవచ్చు. అయితే.. పప్పుతో పాట.. ఏదో ఒక కూరగాయను కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే.. కూరగాయలు అన్నింటినీ కలిపి కిచిడి లాగా తయారు చేసి తీసుకోవడం మంచిది. కొద్దిగా నెయ్యిని కూడా జత చేసుకుంటే రుచి కూడా బాగుంటుంది.
ఇక లంచ్ ఎక్కువగా తీసుకువెళ్లకూడదు. అంటే.. మీరు తినగలిగినంత వరకు మాత్రమే తీసుకువెళ్లాలి. ఓవర్ గా తీసుకువెళ్లి.. మధ్యాహ్నం తినలేక.. తిరిగి ఇంటికి తేవడం లాంటివి చేస్తుంటారు. దాని వల్ల ఆహారం వృథా అవుతుంది. కాబట్టి.. ఆ అలవాటును మార్చుకోవడం మంచిది. తినగలిగినంత ఆహారమే తీసుకువెళ్లడం అలవాటు చేసుకోవాలి.