MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • బంగాళదుంపలు మొలకెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి?

బంగాళదుంపలు మొలకెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి?

బంగాళదుంపలు వెంటనే మొలకెత్తుతూ ఉంటాయి. అలా మొలకెత్తకుండా ఉండాలంటే... వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి? ఎలా స్టోర్ చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 10 2025, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఉండే కూరగాయల్లో బంగాళ దుంప ఒకటి. చాలా మందికి ఈ బంగాళదుంప వేపుడు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఇది చేయడం కూడా  చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే.. వీటితో వచ్చిన సమస్య ఏంటంటే... వెంటనే మొలకలు వస్తూ ఉంటాయి.

28

గతంలో ఎక్కువ రోజులు అయితే మొలకలు వచ్చేవి. కానీ.. ఇప్పుడు అలా కాదు.. కొన్న రెండు, మూడు రోజులకే మొలకలు వచ్చేస్తున్నాయి. అలా మొలక వచ్చిన తర్వాత బంగాళదుంపలు తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఇలా మొలకలు వచ్చాయి కదా.. వాటిని పారేయలేం. కానీ.. మనం కొన్ని చిట్కాలతో ఆలుగడ్డ లను స్టోర్ చేస్తే మొలకలు రాకుండా ఉంటాయట.

38

బంగాళాదుంపలను చల్లగా, గాలి, వెలుతురు వచ్చే చోట ఉంచాలి. వీలైనంత వరకు ఫ్రిజ్‌లో పెట్టకండి. చాలా చల్లని వాతావరణం పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది, దీనివల్ల బంగాళాదుంప రుచి మారిపోతుంది.
 

48

బంగాళాదుంపలను సూర్యకాంతి నుండి దూరంగా ఉంచడం మంచిది. ఎక్కువ వెలుతురు క్లోరోఫిల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆకుపచ్చగా మారడం వల్ల బంగాళాదుంపలు చేదుగా మారుతాయి, దీనివల్ల రుచి మారిపోతుంది.
 

58

నల్లటి మచ్చలు ఉన్న చెడిపోయిన బంగాళాదుంపలను కొనకండి. మార్కెట్ నుండి తెచ్చిన ఈ కూరకాయలను చల్లగా, పొడిగా, చీకటి ప్రదేశంలో ఉంచాలి.
 

68

బంగాళాదుంపల్లో మొలకలు రాకుండా ఉండటానికి ఉత్తమ మార్గం వాటిని పెద్ద పరిమాణంలో కొని నిల్వ ఉంచకపోవడమే. అవసరానికి తగ్గట్టుగా కొనడం మంచిది.
 

78

ఎక్కువ తేమ వల్ల మొలకలు వస్తాయి. కాబట్టి మూసివున్న ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాగితం సంచి, గోనె సంచి, బుట్ట వంటి గాలి ఆడే పాత్రల్లో బంగాళాదుంపలు నిల్వ చేయడం మంచిది.

 

88

బంగాళాదుంపలను ఉల్లిపాయలు లేదా అరటిపండ్లతో కలిపి నిల్వ చేయకండి. ఇవి ఎథిలీన్ వాయువును విడుదల చేస్తాయి, దీనివల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cashew Apples: జీడి పండ్లు ఎక్కడ కనిపించినా కొని తినండి, దీని వల్ల మీరు ఊహించని లాభాలు
Recommended image2
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Recommended image3
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved