బెల్లం టీ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
చక్కెర కంటే బెల్లమే మంచిది. అందుకే చాలా మంది టీలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేస్తున్నారు. కానీ బెల్లం టీ అందరికీ మంచిది కాకపోవచ్చు. కొంతమందికి బెల్లం టీ తాగితే సమస్యలు వస్తాయి.
jaggery tea
మనం ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో చక్కెరను తింటూనే ఉంటాం. ముఖ్యంగా టీ. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల బరువు పెరుగుతారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ మధ్య చక్కెరకు బదులుగా టీలో బెల్లాన్ని వాడుతున్నారు. హోటల్లోనే కాదు చాలా మంది ఇండ్లలో కూడా బెల్లం టీని తయారుచేసి తాగుతున్నారు. కానీ బెల్లం టీ తాగడం వల్ల కొంతమందికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
jaggery-tea
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నేచురల్ స్వీట్ అయిన బెల్లాన్ని ఎలాంటి భయం లేకుండా టీలో కలిపి తాగొచ్చు. దీని క్యారమెల్ లాంటి రుచి టీని మరింత కమ్మగా, మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఇందుకోసం టీలో కొంచెం బెల్లం ముక్కను వేసి అది కరిగే వరకు బాగా కలపాలి. కానీ ఇది చక్కెర కంటే మరింత తీయగా ఉంటుంది. అందుకే దీన్ని టీలో తక్కువగా వేయాలి.
jaggery tea
టీలో బెల్లం వేయడం వల్ల వచ్చే సమస్యలు
శుద్ధి చేసిన చక్కెర కంటే బెల్లమే ఆరోగ్యానికి మంచిది. బెల్లం చక్కెరలా ఆరోగ్యాన్ని పాడు చేయదు. కానీ బెల్లం కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుంది. చక్కెర లాగే బెల్లాన్ని ఎక్కువగా తింటే మీరు తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇది చక్కెర లాగే కేలరీలను ఎక్కువగా కలిగి ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే బెల్లాన్ని ఎక్కువగా తిన్నా మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే బెల్లం డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బెల్లం టీ ప్రతి ఒక్కరికీ మంచిది కాకపోవచ్చు. ముఖ్యంగా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవారు, మొటిమలు , ఉబ్బరం వంటి వేడి సంబంధిత సమస్యలున్న వారు బెల్లంటీని తాగితే శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. ఇలాంటి వారు బెల్లాన్ని తక్కువగా తినడమే మంచిది. అయితే మీకు ఏవైనా సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.
నిజానికి టీలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేయడం మంచిదే. కానీ దీని వల్ల వచ్చే సమస్యలను మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏది ఏమైనా బెల్లాన్ని తక్కువగా తినడమే మంచిది. మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే బెల్లాన్ని తినడానికి ముందు డాక్టర్లను సంప్రదించడం మంచిది.