దొండకాయను తింటే ఏమౌతుందో తెలుసా?
మాంసం కంటే కూరగాయలే మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో దొండకాయ ఒక్కటి. అయితే చాలా మందికి ఈ కూర నచ్చదు. కానీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అసలు దొండకాయను తింటే ఏమౌతుందో తెలుసా?
మనం ప్రతిరోజూ ఏదో ఒక రకమైన కూరగాయను తింటుంటాం. అప్పుడప్పుడు మాంసాన్ని తింటుంటాం. అయితే మాంసం కంటే ఎక్కువ కూరగాయలే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి. అవును కూరగాయల్లో మన శరీరం సక్రమంగా పనిచేయడానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపును నింపడమే కాకుండా ఎన్నో వ్యాధులు రాకుండా కూడా కాపాడుతాయి.
ivy gourd
ఎండాకాలంలో మనకు మార్కెట్ లో ఎన్నో రకాల కూరగాయలు దొరుకుతాయి. వీటిలో దొండకాయ ఒక్కటి. అయితే చాలా మందికి ఈ కూరగాయ టేస్ట్ నచ్చదు. అందుకే దీన్ని మాత్రం తినరు. కానీ దొండకాయలు పోషకాల భాండాగారం. ఇది మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అసలు దొండకాయను తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
bitter gourd
డయాబెటీస్ పేషెంట్లకు..
దొండకాయ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో దీన్ని తినడం వల్ల వీరికి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే దొండకాయను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. నిజానికి ఈ కూరగాయ యాంటీ-హైపర్గ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇవి డయాబెటిస్ ను నిర్వహించడానికి సహాయపడతాయి.
Ivy gourd
ఈ కూరగాయలో కార్బోహైడ్రేట్ పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి కూరగాయను తినడం వల్ల కడుపు తొందరగా నిండుతుంది. ఇది అతిగా తినడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే తొందరగా ఆకలి కాకుండా చూస్తుంది. దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా పెరగకుండా కాపాడుతుంది.
రక్తహీనత
మగవారికంటే ఆడవారే ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారికి దొండకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కూరగాయలో మంచి మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని ఎన్నో రోగాలకు, సంక్రమణలకు దూరంగా ఉంచుతుంది.