బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా?
బెండకాయ కాస్త జిగురుగా ఉంటుంది. అందుకే బెండకాయ కూరను చాలా మంది తినరు. కానీ బెండకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే దీన్ని తినకుండా అస్సలు ఉండలేరు.
బెండకాయ ఎన్నో పోషకాలున్న ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బెడకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ కూరగాయలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో పాటుగా యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.
బెండకాయలో విటమిన్ సి, విటమిన్ కె1 లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ కె1 కొవ్వులో కరిగే విటమిన్. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. బెండకాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
okra
బెండకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. బెండకాయలను తింటే గట్ ఆరోగ్యంగా ఉంటుంది.
okra
బెండకాయలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బెండకాయలో పాలీఫెనాల్స్, ఫైబర్ వంటి సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. డయాబెటిస్ బెండకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
Okra
బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
బెండకాయలోని ఫైబర్ కంటెంట్ మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని తింటే మీరు ఓవర్ గా తినలేరు. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
బెండకాయలో బీటా కెరోటిన్, సెంటిన్, లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బెండకాయ ఎన్నో చర్మ వ్యాధులను కూడా నివారిస్తుంది.