MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • మటన్ ఎన్ని రోజులకోసారి తినాలో తెలుసా?

మటన్ ఎన్ని రోజులకోసారి తినాలో తెలుసా?

మటన్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? మటన్ తినడం వల్ల శరీరానికి మంచిదా? మీకు మటన్ అలెర్జీ ఉందా? మటన్ ఆరోగ్యంగా ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ పోస్ట్ లో తెలుసుకోండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 10 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
mutton curry

mutton curry

చాలా మటుకు మేక మాంసాన్నే ఎక్కువగా తింటుంటారు. అప్పుడప్పుడు మాత్రమే గొర్రె మాంసాన్ని తింటుంటారు. అయితే 100 గ్రాముల గొర్రె మాంసంలో 300 కేలరీలు ఉంటాయి. అలాగే 20 గ్రాముల కొవ్వు, 25 గ్రాముల ప్రోటీన్, 100 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అదే మేక మాంసంలో 100 గ్రాములకు 130 కేలరీలు మాత్రమే ఉంటాయి.

అంటే గొర్రెలతో పోలిస్తే మేక మాంసంలో 35 శాతం కేలరీలు మాత్రమే ఉంటాయి. మేక మాంసంలో 2-3 గ్రాముల కొవ్వు, 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే గొర్రె మాంసం కంటే మేక మాంసమే మంచి పోషకమైందని అంటారు. అయితే మీరు ఈ రెండు మాంసాల్లో ఇనుము, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి 12 లు సమానంగా ఉంటాయి. కానీ కేలరీల్లో మాత్రం పెద్ద తేడా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మటన్ మన శరీరానికి మంచిదేనా? 

మటన్ మన శరీరానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా అని తెలుసుకోవడానికి మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి  మటన్ ను ఎలా వండుతున్నాం, రెండు వారంలో ఎన్ని సార్లు మటన్ ను తింటున్నా? మూడు మటన్ తో ఇతర ఏయే ఆహారాలను తింటున్ నా? 
 

35

మటన్ ను ఎలా వండాలి?

మటన్ ను తినడం వల్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం మటన్ ను ఎక్కువ నూనెతో వేయించకూడదు. మీరు గనుక ఎక్కువ నూనెలో వేయించి, పెద్ద మంటపై ఉడికిస్తే గనుక వాటిలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు, ఇతర పోషకాలు చాలా వరకు తగ్గుతాయి. మటన్ ను ఎప్పుడైనా సరే తక్కువ నూనెలో వేయించాలి. అలాగే మటన్ గ్రిల్, ఉడికించిన మటన్, మటన్ సూప్ లో పోషకాలు అస్సలు తగ్గవు. 
 

45

వారానికి ఎన్ని సార్లు మటన్ ను తినాలి? 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రెడ్ మీట్ ను తక్కువగా తినడమే మంచిది. అయితే మీ శరీరంలో కేలరీల లోపం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం వారానికి రెండు సార్లు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మటన్ తో ఏయే ఆహారాలను తినాలి? 

మటన్ ను ఫైబర్  కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలతో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల పండ్లు, కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పురుషులు రోజుకు 40 గ్రాములు, మహిళలకు 30 గ్రాముల ఫైబర్ అవసరమవుతుంది. అయితే ఈ ఫైబర్ కంటెంట్ మటన్ ను తినడం వల్ల సమస్యలు రాకుండా కాపాడుతుంది. 
 

55
মাংস

মাংস

మటన్ కొలెస్ట్రాల్ ను పెంచుతుందా?

గొర్రె, మేకల్లో కొలెస్ట్రాల్ లెవెల్ 100 గ్రాములకు 100 మి.గ్రా మాత్రమే. కానీ దీనిలో కొవ్వు 20 గ్రాములు ఉంటుంది. కొవ్వు తక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. నూనె లేకుండా మాంసాన్ని వండి తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. ఆలుగడ్డలు, కాలీఫ్లవర్, క్యారెట్లను మటన్ తో ఉడికించి తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత కీరదోసకాయ, ఉల్లిపాయ కూడా తినాలి. ఇవన్నీ కలిసి జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది. దీంతో శక్తి బాగా ఖర్చవుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved