డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ జ్యూస్ ఓ వరం.. దీన్ని తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి ఓ వరంలా పనిచేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు దీన్ని తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా.. ఎన్నో లాభాలు కలుగుతాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయితే చాలా మందికి ఈ సమస్య ఉన్నట్టుగా కూడా తెలియదు. నిజానికి గమనించరు. దీనివల్లే వ్యాధి మరింత ముదిరాక గుర్తిస్తున్నారు. కానీ ఈ టైంలో దీన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది.
డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎక్కువ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఊబకాయం, డయాబెటిస్ మూత్రపిండాల వైఫల్యం, ప్రాణాంతక గుండె జబ్బులు వంటి ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
అయితే సాధారణంగా డయాబెటిస్ పేషెంట్లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి మందులను, ఇన్సులిన్ ఇంజెక్షన్లను వాడుతుంటారు. కానీ వీటితో పాటుగా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుంది.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఎన్నో ఫుడ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని తింటే డయాబెటీస్ పేషెంట్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇలాంటి వాటిలో కాకరకాయ ఒకటి. అవును డయాబెటీస్ పేషెంట్లకు కాకరకాయ జ్యూస్ ఒక వరంలా పనిచేస్తుంది.
కాకరకాయ జ్యూస్ చేదుగానే ఉంటుంది. కానీ ఇది డయాబెటీస్ ను కంట్రోల్ చేయడంలో ఒక టానిక్ లా పనిచేస్తుంది తెలుసా? అందుకే అసలు ఈ కాకరకాయ జ్యూస్ డయాబెటీస్ పేషెంట్లకు ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో తెలుసుకుందాం పదండి.
bitter gourd juice
కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
కాకరకాయలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. దీనిలో కొన్ని యాంటీ డయాబెటిస్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇలాంటి కాకరకాయ జ్యూస్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కాకరకాయలో పాలీపెప్టైడ్-పి లేదా పి-ఇన్సులిన్ అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
కాకరకాయ ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది
కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ జ్యూస్ జీవక్రియను పెంచుతుంది. గ్లూకోజ్ శోషణను నియంత్రించడానికి సహాయపడుతుంది.
అందుకే కాకరకాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే? ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది.
కాకరకాయ జ్యూస్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది
కాకరకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఇతర పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. డయాబెటిక్ రోగులు చాలా సార్లు ఆక్సీకరణ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. కానీ ఈ ఆక్సీకరణ ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఇది శరీరంలోని వివిధ అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం వల్ల కాకరకాయ రసం డయాబెటిక్ రోగులలో నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
కాకరకాయ జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది
కాకరకాయ జ్యూస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిదని చెప్తారు. డయాబెటీస్ పేషెంట్లు బరువు పెరగకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.