వీళ్లు నెయ్యి అస్సలు తినకూడదు తెలుసా..?
మనం కూడా పిల్లలకు ఇంట్లో భోజనం పెడితే.. కచ్చితంగా నెయ్యి వడ్డించే పెడుతూ ఉంటాం. కానీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం.. నెయ్యి తినకూడదట.
ghee
నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. మితంగా నెయ్యి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే... నెయ్యిలో మన శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అంతెందుకు... డయాబెటిక్ పేషెంట్స్ వారు వైట్ రైస్ తిన్నా కూడా.. అందులో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తినడం వల్ల.. వాళ్ల షుగర్ లెవల్స్ పెరగకుండా కాపాడుతుంది. ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉన్న ఈ నెయ్యిని కొందరు మాత్రం అస్సలు తినకూడదట. వారు నెయ్యి తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాలసి వస్తుందట. మరి.. నెయ్యి ఎవరు తినకూడదో ఇప్పుడు చూద్దాం...
fake ghee oil
నెయ్యి ని మనం పాల నుంచి తయారు చేస్తాం. నెయ్యి ఆరోగ్యానికి మంచిది అని , కచ్చితంగా ఒక స్పూన్ అయినా తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. మనం కూడా పిల్లలకు ఇంట్లో భోజనం పెడితే.. కచ్చితంగా నెయ్యి వడ్డించే పెడుతూ ఉంటాం. కానీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం.. నెయ్యి తినకూడదట.
లివర్ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా నెయ్యిని తీసుకోకూడదట. నెయ్యి తినడం వల్ల లివర్ సంబంధిత సమస్యలురావు. కానీ.. లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం నెయ్యి తీసుకోకూడదు. తీసుకుంటే.. వీరికి జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.
నిజానికి కడుపుతో ఉన్న స్త్రీలు.. కచ్చితంగా తమ డైట్ లో నెయ్యి భాగం చేసుకోవాలి. కానీ.. ఒకవేళ వారికి ఏవైనా ఆహారం అరుగుదల సమస్యలు ఉంటే.. వారు నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే... మలబద్దకం, గ్యాస్ తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
నెయ్యిలో కొలిస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కాస్త నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే.. అందులోనే ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వారు నెయ్యి తీసుకుంటే.. అది హార్ట్ ఫెయిల్యూర్ కి కారణం అయ్యే ప్రమాదం ఉంది.
ghee
ఇక.. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యలతో బాధడుతున్నారు. బరువు తగ్గాలి అని డైట్ చేసేవారు నెయ్యికి దూరంగా ఉంటే మంచిది. రోజుకి రెండు స్పూన్లకు మంచి ఎక్కువ నెయ్యి తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే.. వారికి బరువు తగ్గడం కష్టంగా మారుతుంది.
ghee
ఇక.. కొందరికి మొటిమల సమస్య ఉంటుంది. అవి వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటివారు నెయ్యి తీసుకోవడం వల్ల.. ఆ మొటిమల కౌంట్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి... మొటిమలు వంటి సమస్యలు ఉన్నవారు వాటిని తినకపోవడమే మంచిది.