ఇడ్లీ Vs దోశ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
ఇడ్లీ, దోశ రెండింటిిలో ఆరోగ్యానికి ఏది మంచిది? పోషకాల విషయంలో.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం…
దక్షిణాదిన ప్రతి ఇంట్లో కామన్ గా తినే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ, దోశ ఉంటాయి. రెగ్యులర్ గా వీటినే తింటూ ఉంటాం. ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రుచిలోనూ ఈ రెండూ అద్భుతంగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మరి, ఈ రెండింటిిలో ఆరోగ్యానికి ఏది మంచిది? పోషకాల విషయంలో.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం…
ఇడ్లీ Vs దోశ.. తయారీ విధానాలు..
1.ఇడ్లీ…
దీనిని తయారు చేసే విధానం అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిరి మీద ఉడికిస్తారు. చాలా మృదువుగా ఉంటాయి. చిన్న పిల్లలకు అయినా సులభంగా జీర్ణం అవుతుంది. ఈ ఇడ్లీ తయారు చేయడానికి మనం ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదు. ఆహారం లైట్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇడ్లీని ప్రిఫర్ చేయవచ్చు.
2.దోశ..
దోశను ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు.పలచగా, క్రిస్పీగా ఉంటుంది. నెయ్యి లేదంటే నూనెతో దీనిని కాలుస్తారు. ఇడ్లీతో పోలిస్తే.. క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మసాలా దోశ, రవ్వ దోశ ఇలా ఐటెమ్ మారుతున్న కొద్దీ..క్యాలరీలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇడ్లీ, దోశలో పోషక విలువలు…
- ఇడ్లీ, దోసె రెండూ fermentation ద్వారా తయారు చేస్తారు. అంటే పిండిని పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. కాబట్టి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రొబయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి.
- ఇడ్లీ:
- క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బాగా సహాయపడుతుంది.
- దోశ:
- కొంచెం ఎక్కువ క్యాలరీలతో శక్తివంతమైన భోజనం కోసం అనుకూలంగా ఉంటుంది
రుచి, కాంబినేషన్..
- ఇడ్లీ: న్యూట్రల్ రుచి, చట్నీ, సాంబార్‌తో బాగుంటుంది.
- దోసె: క్రిస్పీ టెక్స్చర్ తో ఉంటుంది. చాలా మంది దోశను ఇష్టపడతారు. చట్నీ, సాంబారు తో బాగుంటుంది.
- ఆరోగ్య పరమైన అంశాలు
- ఇడ్లీ: జీర్ణ సమస్యలున్నవారికి అనుకూలం.
- దోసె: నూనె ఎక్కువగా ఉపయోగించకుండా, మితంగా వాడితే.. ఆరోగ్యంగానే ఉంటుంది.
తేలికైన, ఆరోగ్యకరమైన ఆప్షన్ కావాలంటే ఇడ్లీ ఎంచుకోండి.
- రుచికరమైన, భిన్నత కలిగిన ఆహారం కావాలంటే దోసె ఎంచుకోండి.