మెంతికూర చేదుగా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా?
మెంతి ఆకులు కాస్త చేదుగా ఉంటాయి. దీనివల్ల వీటితో చేసిన కూరలు చేదుగా అవుతాయి. దీంతో కూరల టేస్ట్ మారుతుంది. కాబట్టి మెంతికూర చేదుగా కాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరల్లో మెంతుకూర ఒకటి. మెంతికూరతో పప్పు, చట్నీ, పరోటాలు ఇలా ఎన్నో రకాల వంటలను చేసుకుని తినొచ్చు. నిజానికి మెంతికూరలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు.. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
fenugreek leaves
అయితే ఈ మెంతికూర టేస్ట్ కొంచెం చేదుగా ఉంటుంది. అందుకే దీనితో చేసిన ప్రతి కూర కొంచెం చేదుగా ఉంటుంది. చేదు నచ్చని వారు దీన్ని ఖచ్చితంగా పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈ చేదు వల్ల వంటల రుచి పూర్తిగా మారుతుంది. అందుకే ఈ చేదు పోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మకాయ, ఉప్పు
నిమ్మకాయ, ఉప్పుతో మెంతికూర చేదుగా కాకుండా చేయొచ్చు. నిజానికి ఈ రెండూ మెంతి ఆకుల్లోని చేదును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీనికోసం ఒక గిన్నెలో నీళ్లను మరిగించండి. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో మెంతి ఆకులను వేసి 1-2 నిమిషాలు ఉంచండి. ఈ ఆకులు వేడి అయ్యాక అందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేయండి. మెంతి ఆకులు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆకులను వడకట్టి 3 నుంచి 4 సార్లు చల్ల నీళ్లతో ఆకులను కడగండి. దీనివల్ల ఈ ఆకుల్లోని చేదు తగ్గుతుంది. అలాగే రంగు కూడా మారకుండా ఉంటుంది.
తీపి పదార్ధాలు
మెంతికూర చేదుగా కాకూడదంటే దీన్ని వండేటప్పుడు అందులో క్యారమలైజ్డ్ ఉల్లిపాయను కలపండి. దీనివల్ల మెంతికూర చేదుగా కాదు. మెంతికూరలో కొంచెం తీపిని కలిపితే చేదు సమతుల్యం అవుతుంది. అందుకే మెంతికూర వండేటప్పుడు దాంట్లో కొంచెం బెల్లం కలపండి. దీనివల్ల టేస్ట్ తీయగా కాదు, చేదుగా కూడా కాదు.
పుల్లని పదార్ధాలు
పులుపు కూడా చేదును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిజానికి మెంతికూరలో ఉండే ఆల్కలాయిడ్స్ వల్లే టేస్ట్ చేదుగా ఉంటుంది. అందుకే మెంతి కూరలో కొంచెం పులుపును కలిపినా దీని చేదు చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసం మెంతికూర వండేటప్పుడు దాంట్లో పెరుగు, చింతపండు లేదా నిమ్మరసం వంటివి వేయండి. ఇవి చేదును పోగొట్టడమే కాకుండా.. కూర టేస్టీగా అయ్యేలా కూడా చేస్తాయి.
ఇతర కూరగాయలతో కలపండి
మీకు మెంతి కూరలోని చేదు నచ్చకపోతే.. ఈ ఆకులను బఠానీలు, క్యారెట్, బంగాళాదుంపలు, క్యాబేజీ వంటి కూరగాయలతో మిక్స్ చేసి వంట చేయండి. ఇది మీకు చేదుగా అనిపించదు. అంతేకాకుండా.. రుచిగా కూడా అనిపిస్తుంది. మీకు తెలుసా? కూరగాయలు చేదును కొంతవరకు గ్రహిస్తాయి. రుచిని పెంచుతాయి.
ఆలం పౌడర్
ఆలంతో మనం ఎన్నో రకాల పనులను చేయొచ్చు. ముఖ్యంగా ఇది చేదును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా మెంతికూరను 2-3 సార్లు చల్ల నీళ్లతో కడగండి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేడిచేయండి. దీంట్లో ఒక టీస్పూన్ ఆలం పౌడర్ ను వేయండి. ఈ తర్వాత మెంతికూరను వేసి 2-3 నిమిషాలు వేడి చేయండి. తర్వాత మెంతిఆకులను బయటకు తీసి 3-4 సార్లు చల్ల నీళ్లతో కడగండి. ఇది మెంతికూరలోని చేదును తొలగిస్తుంది.
ఉప్పుతో ఉడికించాలి
ఉప్పు కూడా చేదును చాలా వరకు తగ్గిస్తుంది. మెంతికూర చేదును తొలగించడానికి ఇదొక గొప్ప మార్గం. మెంతికూర వండటానికి ముందు వేడి నీళ్లలోమెంతి ఆకులను వేయండి. దీనిలో చిటికెడు ఉప్పు వేసి కొన్ని సెకన్ల పాటు ఉడికింండి. 15-20 సెకన్ల తర్వాత మంట ఆపేసి మెంతికూరను చల్ల నీళ్లతో కడిగి ఆరబెట్టండి. దీనితో చేదు పోతుంది. ఈ ఆకులతో మీకు నచ్చిన విధంగా వంట చేసుకుని తినొచ్చు.అయితే మెంతికూరను ఎక్కువ సేపు ఉడికించకూడదు. ఎందుకంటే అతిగా ఉడికిస్తే కూడా మెంతికూరలో చేదు మరింత పెరుగుతుంది.