పిండిలో ఏం కలిపితే పూరీలు బాగా పొంగుతాయో తెలుసా?
ఈ కింది చిట్కాలు ఫాలో అయితే... మీరు చేసిన ప్రతి పూరీ కచ్చితంగా పొంగుతుంది. మరి.. ఆ ట్రిక్స్ ఏంటో ఓసారి చూద్దాం...
అన్ని బ్రేక్ ఫాస్ట్ లకంటే... పూరీలనే చాలా మంది ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలకు పూరీ అంటే భలే ఇష్టం ఉంటుంది. అయితే.. పూరీలు మంచిగా పొంగితేనే రుచిగా ఉంటుంది. కానీ.. హోటల్ లో పొంగినట్లు.. మనకు ఇంట్లో మంచిగా పూరీలు పొంగవు. ఒకటి పొంగితే.. మరొకటి పొంగదు. అయితే.. ఈసారి మీరు పూరీ చేసినప్పుడు ఈ కింది చిట్కాలు ఫాలో అయితే... మీరు చేసిన ప్రతి పూరీ కచ్చితంగా పొంగుతుంది. మరి.. ఆ ట్రిక్స్ ఏంటో ఓసారి చూద్దాం...
ఆరోగ్యానికి మంచిది కాదని.. చాలా మంది మైదా ను వాడరు. కేవలం.. గోధుమ పిండి తోనే చేస్తారు. కానీ.. మైదాతో చేసినంత రుచి.. అచ్చంగా గోధుమ పిండితో చేస్తే రాదు. అయితే... 750 గ్రాముల గోధుమ పిండిలో.. 250 గ్రాముల మైదా పిండి కలిపి.. అప్పుడు.. పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల.. పూరీ రుచి బాగా పెరుగుతుంది. మనం కలిపే మైదా పిండి శాతం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి..ఆరోగ్యానికి వచ్చిన ఢోకా కూడా ఉండదు. ఇలా ఈ రెండూ కలిపి చేయడం వల్ల.. పూరీలు చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి.
మరీ.. మైదా పిండి కలపడం ఎక్కువగా ఇష్టం లేకపోతే... ఆ స్థానంలో మీరు బొంబాయి రవ్వ కలపుకోవచ్చు. బొంబాయి రవ్వ కలిపినా కూడా పూరీలు చాలా మృదువుగా మారతాయి. అంతే.. మీరు కప్పు మైదా పిండిలో.. రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ కలిపినా చాలు.. టేస్ట్ అదరిపోతాయి. పూరీలు కూడా మంచిగా పొంగుతాయి.
ఇది కూడా కాదు అంటే... మీరు ఒక కప్పు పూరీ పిండిలో అర టీ స్పూన్ పంచదార కలిపి... పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడు కూడా పూరీలు బాగా పొంగడంతో పాటు.. మంచిగా ఎర్రగా కాలతాయి. చూడటానికి బాగుంటాయి.. రుచి కూడా అద్భుతంగా ఉంటాయి.
పిండి కలుపుకున్న తర్వాత.. ఒక్కొక్కటిగా ఉండలుగా చేతితో చేయడానికి బదులు... కత్తితో సమానంగా కట్ చేసుకోవాలి. అప్పుడు పూరీలు సమానంగా వస్తాయి. అప్పుడు కాలడం కూడా అన్నీ ఒకే విధంగా మంచిగా కలతాయి. చక్కగా పొంగుతాయి.
ఇక పూరీలు కాల్చే కడాయి కూడా.. కొంచెం పెద్దదిగా ఉండాలి. మనం చేసే పూరీ సైజ్ కి.. కడాయి సైజు డబల్ ఉండాలి. అప్పుడే.. అవి మంచిగా పొంగడానికి సహాయపడుతుంది.