Kitchen Tips: రాత్రి మిగిలిన అన్నం తో ఇడ్లీ చేయచ్చు తెలుసా..?
ఈ మిగిలిపోయిన అన్నంతో.. మెత్తని.. ఇడ్లీ తయారు చేసుకోవచ్చట. అప్పటికప్పుడు.. ఆ అన్నంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం..
రాత్రిపూట వండిన అన్నం.. మిగిలిపోవడం చాలా సర్వసాధారణం. ఆ అన్నాన్ని.. ఉదయాన్నే తినడం చాలా మందికి నచ్చదు. కానీ.. పారేయడం ఇష్టంలేక.. అందరూ... ఆ అన్నంతో.. పులిహోర చేసుకొని తినేస్తారు. అయితే... ఈ పులిహోర తినడానికి కూడా.. బోర్ గా అనిపించవచ్చు. పొద్దునే రైస్ ఏం తింటాం అని కూడా అనుకోవచ్చు.
అయితే... ఈ మిగిలిపోయిన అన్నంతో.. మెత్తని.. ఇడ్లీ తయారు చేసుకోవచ్చట. అప్పటికప్పుడు.. ఆ అన్నంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం..
ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
1 కప్పు అన్నం
1 కప్పు పిండి
1/2 కప్పు పెరుగు
1 టీస్పూన్ నూనె
1 ఈనో
ఉప్పు రుచి చూడటానికి
నీరు..
దాదాపు.. అందరూ ఇడ్లీ తినడానికి ఇష్టపడతారు. ఇది రుచికరమైనది .త్వరగా జీర్ణమవుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉంటాయి., కానీ దీనికి తరచుగా బియ్యాన్ని గంటల తరబడి నానబెట్టి, ఆపై గ్రైండ్ చేసి.. మరుసటి రోజు ఇడ్లీ తయారు చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా లేకుండా.. రాత్రి మిగిలిన అన్నంతో సింపుల్ గా ఇడ్లీ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం..
ముందుగా.. మిగిలిపోయిన అన్నానికి కొద్దిగా నీరు కలిపి.. దానిని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఆ తర్వాత.. అందులో.. ముందుగా ఉంచుకున్న బియ్యం పిండిని కలుపుకోవాలి. మరీ మందంగా.. మరీ పలచగా లేకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. దానికి సెమోలినా జోడించండి. ఉప్పు, పెరుగు . నీరు వేసి బాగా కలపాలి. అన్నింటినీ బాగా వేసి.. కలపాలి. ఈ మిశ్రమంతో.. ఇడ్లీలు వేసుకోవచ్చు.
సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని బాగా కలపాలి. ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో.. అచ్చం అలా ఉండేలా బాగా కలుపుకోవాలి. అవసరమనిపిస్తే.. దానిలో కొద్దిగా నీరు కలుపుకోవాలి.
ఇప్పుడు.. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని.. వాటికి కొద్దిగా నూనె రాయిలి. ఆ తర్వాత.. ఇడ్లీ మిశ్రమాన్ని.. ఇడ్లీలు మాదిరిగా వేసి.. ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి. అంతే... పది నిమిషాల్లో.. మెత్తగా,... రుచికరమైన ఇడ్లీలుు రెడీ అవుతాయి.
ఇప్పుడు ఈ ఇడ్లీని.. మీకు నచ్చిన పల్లీ చట్నీ, సాంబారు, అల్లం చట్నీ.. ఇలా దేనితో అయినా కలిపి తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.