MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Curd:ఈ చిన్న టెక్నిక్ వాడితే పెరుగు క్రీమీగా, టేస్టీగా మారడం పక్కా

Curd:ఈ చిన్న టెక్నిక్ వాడితే పెరుగు క్రీమీగా, టేస్టీగా మారడం పక్కా

అమ్మమ్మలు చెప్పిన ఓ సింపుల్ ట్రిక్ ని ఫాలో అయితే.. పెరుగు పుల్లగా అవ్వకపోవడమే కాదు... క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. మరి, దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2025, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13


ఓపక్క ఎండాకాలం వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలు తట్టుకోవాలంటే  రోజూ పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణులు కూడా ఈ ఎండాకాలంలో రోజూ పెరుగు తినాలని చెబుతూ ఉంటారు. దీనిని తినడం వల్ల కడుపులో చల్లగా ఉండటమే కాకుండా.. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. అయితే.. చాలా మందికి ఈ ఎండాకాలంలో పెరుగు చేయడం సరిగా రాదు. వెంటనే పుల్లగా అయిపోయిందని.. నీళ్లలా ఇరిగిపోయినట్లుగా ఉందని చెబుతూ ఉంటారు. అయితే... అమ్మమ్మలు చెప్పిన ఓ సింపుల్ ట్రిక్ ని ఫాలో అయితే.. పెరుగు పుల్లగా అవ్వకపోవడమే కాదు... క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. మరి, దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23


క్రీమీ పెరుగును తయారు చేయడానికి, మీరు ముందుగా పాలను సిద్ధం చేసుకోవాలి. దీని కోసం, మీరు మొదట మీ అవసరానికి అనుగుణంగా పాలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు సాధారణ పాలలో 3 చెంచాల పాలపొడిని వేసి బాగా కలపాలి. దానిలో ఎటువంటి ముద్దలు లేవని నిర్ధారించుకోండి. ఇప్పుడు పాలను గ్యాస్ మీద తక్కువ మంట మీద మరిగించండి. అది మరిగే వరకు 2 నుండి 3 సార్లు కాగపెట్టాలి. ఇది మీ పెరుగును చాలా చిక్కగా చేస్తుంది.

33
curd

curd

పాలు మరిగేటప్పుడు, దానిని గ్యాస్ నుండి తీసి చల్లబరచండి. పాలు గోరువెచ్చగా మారినప్పుడు, అది పెరుగు చేయడానికి సిద్ధంగా ఉంటుంది.  పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో చాలా కొంచెం పెరుగు తోడు వేయాలి.  తర్వాత స్పూన్ తో కలపాలి. ఇప్పుడు ఆ పాలను ఒక మట్టి కుండలో  పోసి.. అల్లూమినియం ఫాయిల్ తో కవర్ చేయాలి. అంతే... ఐదారు గంటల్లో మీకు కమ్మని, చిక్కని , రుచికరమైన పెరుగు తయారైనట్లే..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved