అన్నం తిన్నా బరువు పెరగొద్దంటే ఏం చేయాలి?
వైట్ రైస్ ను తింటే బరువు పెరగడం పక్కా. ఎందుకంటే దీనిలో కేలరీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి. కానీ మీరు ఒక విధంగా అన్నాన్ని తింటే అస్సలు బరువు పెరగరు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

rice
ఈ రోజుల్లో పిల్లలు, టీనేజర్ల నుంచి ప్రతి ఏజ్ వాళ్లు ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. కానీ ఈ ఓవర్ వెయిట్ వల్ల శరీరం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే చాలా మంది బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిలో డైటింగ్ ముందుంటుంది. ఇకపోతే డైటింగ్ లో భాగంగా చాలా మంది చేసే పని అన్నాన్ని పూర్తిగా తగ్గించడం లేదా మానేయడం. ఎందుకంటే అన్నం తింటే బరువు పెరుగుతామని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే బియ్యంలో కేలరీలు, పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కానీ మీరు అన్నం తిన్నా బరువు పెరగకుండా ఉండే చిట్కాలు కొన్ని ఉన్నాయి. వీటిని ఫాలో అయితే మీరు అన్నం మానేయకున్నా బరువు సులువుగా తగ్గొచ్చు. బరువు పెరగకుండా ఉండొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అన్నం తిన్నా బరువు పెరగొద్దంటే ఇలా చేయండి
మోతాదులో తినాలి
మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు అన్నాన్ని ఎక్కువగా తినకూడదు. బరువు తగ్గాలంటే మీరు మీరు రోజంతా తినే దానికంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే అన్నాన్ని తక్కువగా తినాలి. అరకప్పు వైట్ రైస్ లో 100-150 కేలరీలు ఉంటాయి. అందుకే అన్నాన్ని తక్కువగా తినాలి. అలాగే కూరగాయలను, పప్పులను ఎక్కువగా తినాలి. ఇవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి మీ కడుపును నింపుతాయి. ఆకలి కానీయవు.
అన్నం ఎలా వండాలంటే
అన్నం తిన్నా బరువు పెరగొద్దంటే మీరు అన్నాన్ని ఎలా వండుతున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది అన్నాన్ని వండేటప్పుడు నూనె లేదా నెయ్యిని ఉపయోగిస్తుంటారు. కానీ వీటివల్ల మీరు బరువు బాగా పెరుగుతారు. బరువు పెరగొద్దంటే కుక్కర్ లో కాకుండా గిన్నెలోనే అన్నాన్ని వండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బియ్యంలోని పిండి పదార్థాలు చాలా వరకు తొలగిపోతాయి. ఇకపోతే అన్నాన్ని వండటానికి ముందు బియ్యాన్ని కడిగి కాసేపు నానబెట్టాలి. ఈ విధంగా వండిన అన్నాన్ని గనుక తింటే మీరు బరువు పెరిగే అవకాశమే ఉండదు.
ప్రోటీన్, కూరగాయలతో తినాలి
అన్నంతో సన్నని ప్రోటీన్, చాలా కూరగాయలను తింటే మంచిది. వీటితో అన్నాన్ని తింటే సమతుల్య ఆహారం అవుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. మీరు అన్నంతో పాటుగా పప్పు, రాజ్మా, పనీర్, శనగలు, గ్రిల్డ్ చికెన్ లేదా చేపలను ఎక్కువగా కలుపుకుని తింటే బరువు అస్సలు పెరగరు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ప్రోటీన్ జీర్ణం కావడానికి మీ శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల మీరు కేలరీలను ఎక్కువగా బర్న్ చేయగలుగుతారు.దీంతో మీరు బరువు తగ్గుతారు. అంతేకాదు అన్నంతో కూరగాయలను ఎక్కువగా తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
మీరు బరువు తగ్గాలనుకుంటే అన్నాన్ని మధ్యాహ్నం పక్కాగా తినండి. ఎందుకంటే అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీంతో మీరు శక్తివంతంగా ఉంటారు. మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి తగిన సమయం కూడా లభిస్తుంది. కానీ రాత్రిపూట మాత్రం అన్నాన్ని తినకండి. దీనివల్ల మీరు బరువు పెరిగే ప్రమాదం ఉంది. బరువు తగ్గాలనుకుంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వడమే కాకుండా.. మీరు రోజూ వ్యాయామం కూడా చేయాలి. అప్పుడే మీరు కోరుకున్న విధంగా బరువు తగ్గుతారు.