పొటాటోస్ ఇలా తింటే.. ఈజీగా బరువు తగ్గుతారా..?
బరువు తగ్గాలి అనుకునేవాళ్లు.. అసలు పొటాటో తినకూడదు అని చెబుతుంటారు. అంతెందుకు షుగర్ పెరగడానికి, బీపీ పెరగడానికి కూడా ఈ ఆలుగడ్డే కారణం అని నిందించేవారు కూడా ఉన్నారు
పొటాటో అదేనండి బంగాళదుంపలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా ఆలుతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడనివారు ఉండరు. పిల్లలు అయితే.. ఎగబడి మరీ తింటూ ఉంటారు. అయితే.. ఆలూతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినడం వల్ల.. బరువు పెరిగిపోతామని భయపడుతూ ఉంటారు. బరువు తగ్గాలి అనుకునేవాళ్లు.. అసలు పొటాటో తినకూడదు అని చెబుతుంటారు. అంతెందుకు షుగర్ పెరగడానికి, బీపీ పెరగడానికి కూడా ఈ ఆలుగడ్డే కారణం అని నిందించేవారు కూడా ఉన్నారు. కానీ... తినే విధంగా తింటే... ఆలు తిని కూడా ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి.. దానిని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం...
అసలు నిజంగా బంగాళదుంపలు మన బరువు తగ్గిస్తాయా అంటే అవును అనే చెబుతున్నారు నిపుణులు. ఇది చాలా మందికి షాకింగ్ గా అనిపించొచ్చు. కానీ.... మన శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గించడంలో కచ్చితంగా ఇవి సహాయం చేస్తాయి. ఎందుకంటే.. వీటిని తినడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందనున్నాయి.
బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారంలో ఫైబర్ తీసుకోవాలి. ఆ ఫైబర్ పొటాటోస్ లో పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. అంతేకాదు.. క్యాలరీల భయం కూడా లేదు. ఒక బంగాళాదుంప (100 గ్రాములు) 80 కేలరీలను మాత్రమే అందిస్తుంది.
2. పోషకాలు బంగాళాదుంపలలో విటమిన్ సి, పొటాషియం , విటమిన్ B6 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. శరీర కణజాలాల పెరుగుదల, అభివృద్ధికి , మరమ్మత్తుకు విటమిన్ సి అవసరం. పొటాషియం కండరాల సంకోచాలు, ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ B6 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం మరియు శరీరంలోని అనేక విధులకు మద్దతు ఇస్తుంది.
3. ఆరోగ్యకరమైన పిండి పదార్ధాలు బంగాళాదుంపలు సంక్లిష్ట పిండి పదార్థాలను కలిగి ఉంటాయి అంటే అవి క్రమంగా , స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. అంటే మీరు బంగాళాదుంపలను సరైన పద్ధతిలో తింటే, అది మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా , శక్తివంతంగా ఉంచుతుంది.
potato
ఇవన్నీ సరే.. కానీ ఎలా తీసుకుంటే బంగాళదుంపలతో బరువు తగ్గుతారో కూడా తెలుసుకోవాలి. ఆలుగడ్డను వేయించి వాటిని తిని మేం బరువు తగ్గలేదు అనుకోవద్దు. అలా కాదు. ఉడికించిన వాటిని మాత్రమే తినాలి. ఉడికించిన వెంటనే కాకుండా.. ఆరనివ్వాలి. ఆ తర్వాతే తినాలి.
potato 1.j
ఇక.. బంగాళ దుంపను కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అన్నం, రోటీ, బ్రెడ్ లతో తినకూడదు. ఇలా తింటే నిజంగానే బరువు పెరుగుతారు. అలా కాకుండా.. కేవలం.. ఉడకపెట్టిన బంగాళదుంపలను మాత్రమే తినాలి. వీటిని ప్రోటీన్ గా తీసుకోవాలి. వీటికి జతగా కార్బ్స్ మాత్రం యాడ్ చేయకూడదు. అయితే.. తినమన్నారు కదా అని అతిగా తినకూడదు. మితంగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది. కేవలం బంగాళదుంపులను ఉడకపెట్టి టిక్కీల్లాగా చేసుకొని తింటే.. ఆరోగ్యం గా ఉంటారు..