రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినొచ్చు?
ఎండాకాలం పోయిందంటే మామిడి పండ్లు దొరకనే దొరకవు. అందుకే ఈ సీజన్ ప్రతిరోజూ మామిడి పండ్లను తింటుంటారు. కానీ మామిడి పండ్లను రోజుకు ఎన్ని పడితే అన్ని తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినాలంటే?
Image: Getty
మామిడి పండ్లను చూస్తే తినకుండా ఉండటం కష్టమైన పనే. ముందే ఈ ఒక్క సీజన్ లోనే మామిడి పండ్లు దొరుకుతాయి. ఇంకేముంది ఎన్ని పడితే అన్ని మామిడి పండ్లను లాగిస్తూనే ఉంటారు. రకరకాల మామిడి పండ్లు రకరకాల రుచులను కలిగి ఉంటాయి. అందుకే జనాలు మ్యాంగో షేక్ నుంచి మ్యాంగో ఐస్ క్రీం వరకు ఏదో ఒక విధంగా ప్రతిరోజూ తింటూనే ఉంటారు. కానీ మామిడి పండ్లను మోతాదుకు మించి తింటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Image: Getty
మామిడి పండ్ల పోషకాలు
విటమిన్లు, ఖనిజాలు
మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో పాటుగా సహజ చక్కెరలు సమృద్ధిగా ఉంటాయి.
జీర్ణ ఆరోగ్యానికి మంచిది
మామిడి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే సహజ ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లలో ఉండే ఫైబర్ కంటెం్ట ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతునిస్తుంది. అలాగే ఇది మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. అలాగే సాధారణ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది.
కంటి ఆరోగ్యం
మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటిచూపును కాపాడుతుంది. కళ్లు బాగా కనిపించేందుక కూడా సహాయపడుతుంది. ఇది కళ్లు పొడిబారడం, రాత్రి అంధత్వం వంటి కంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.
Image: Getty
రోగనిరోధక శక్తి
మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోన్యూట్రియెంట్స్ కూడా మామిడి పండ్లలో పుష్కలంగా ఉంటాయి.
Image: Getty
గుండె ఆరోగ్యం
మామిడి పండ్లలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం ఆరోగ్యకరమైన రక్తప్రసరణను నిర్వహిస్తాయి. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ యాంటీ ఆక్సిడెంట్ మాంగిఫెరిన్ కూడా ఉంటుంది. ఇది కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Image: Getty
రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినొచ్చు?
మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల మొటిమలు, ఒంట్లో వేడి పెరగడం, అల్సర్లు, మలబద్ధకం, ఉబ్బరం, విరేచనాలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు ఎంత రుచిగా అనిపించినా వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో చక్కెర, కేలరీలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే మీ శరీరానికి మంచిది కాదు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంతో పాటుగా శరీర బరువు పెరిగేలా కూడా చేస్తుంది.
ఆరోగ్య సమస్యలను నివారించడానికి మామిడి పండ్లను మితంగా తినడం మంచిది. పెద్ద మొత్తంలో తినడం వల్ల దగ్గు, పుండ్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి.