fish gravy: చేపల కూరను ఎన్ని రోజులు తినొచ్చు?
చేపల కూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే మనలో చాలా మంది చేపల కూర పులుసును రెండు మూడు రోజుల వరకు తింటుంటారు. కానీ చేపల కూరను ఎన్ని రోజుల వరకు తినొచ్చో తెలుసా?

fish
సీఫుడ్ ను చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా చేపలను. చేపల ఫ్రై, చేపల పుసులు ఇలా చేపలతో రకరకాల వంటలనుచేసుకుని తింటుంటారు. నాన్ వెజ్ లో చాలా మందికి చేపలే ఇష్టం. అందుకే వారం వారం చేపల కూరను వండుకుని తినేవారున్నారు. అయితే చాలా మంది చేపలను పులుసు పెట్టి మూడు నాలుగు రోజుల దాకా తింటుంటారు. చేపల కూర ఏం చెడిపోదని, తిన్నా మంచిదేనని చెప్తుంటారు. అసలు చేపల కూరను ఫ్రిజ్ లో పెట్టొచ్చా? దీన్ని ఎన్ని రోజుల వరకు తినొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చేపల కూరను ఫ్రిజ్ లో పెట్టొచ్చా?
చాలా మంది చేపల పులుసును ఎక్కువగా పెట్టేసి రెండు మూడు రోజుల వరకు తింటారు. ఇది చెడిపోకూడదని ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటారు. అయితే చేపల పులుసును ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. కానీ దీనిని సరిగ్గా వేడి చేసి చల్లబరచాలి. అలాగే గాలి వెళ్లని కంటైనర్ లో నిల్వ చేయాలి. అప్పుడు చేపల పులుసు రుచి మారదు. తాజాగా బాగా నిల్వ ఉంటుంది.
ఇడ్లీ ఫిష్ కర్రీ
చెరువులు, సరస్సుల్లో పెరిగే చేపల కూర రుచి బాగుంటుంది. ముఖ్యంగా ఈ చేపల కూర పులుసును మీరు మరుసటి రోజు ఉదయం ఇడ్లీ లేదా దోశతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. రాగి రొట్టెతో తిన్నా బాగుంటుంది.
చేపల కూరను ఎన్ని రోజులు తినొచ్చు?
మీరు స్వయంగా ఇంట్లో వండిన చేపల కూరను ఫ్రిజ్ లో పెట్టుకుని మూడునాలుగు రోజుల వరకు తినొచ్చు. అయితే చేపల కూరను వేడి చేసి తిన్న ప్రతిసారీ కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేడి చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.