MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • ఉడకపెట్టిన గుడ్లను ఎంత సేపటిలో తినేయాలి..?

ఉడకపెట్టిన గుడ్లను ఎంత సేపటిలో తినేయాలి..?

ఉడకపెట్టిన తర్వాత.. కోడిగుడ్డును ఎంత సేపటిలో తినేయాలి..? ఉడకపెట్టిన తర్వాత  ఎన్ని గంటలు కోడిగుడ్డు తాజాగా ఉంటుంది..? ఈ విషయాలు మీకు తెలుసా? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2024, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఎగ్ ప్రోటీన్ కి మంచి సోర్స్. దీనిని ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే.. ఉడకపెట్టిన గుడ్డు తీసుకుంటే.. ఇంకాస్త మంచిది. అందుకే.. ప్రతిరోజూ కనీసం ఒక్కటైనా ఉడకపెట్టిన గుడ్డు తినాలి అని మనకు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అయితే.. ఉడకపెట్టిన తర్వాత.. కోడిగుడ్డును ఎంత సేపటిలో తినేయాలి..? ఉడకపెట్టిన తర్వాత  ఎన్ని గంటలు కోడిగుడ్డు తాజాగా ఉంటుంది..? ఈ విషయాలు మీకు తెలుసా? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కోడిగుడ్డు ఉడికించిన వెంటనే మనం ఏం చేస్తాం...? ముందుగా దానిపైన ఉన్న షెల్ ని తీసేస్తాం. అయితే.. అలా షెల్ తీసి ఉంచడం వల్ల.. గుడ్డుకు గాలి తగిలి.. హానికరమైన సూక్ష్మజీవులు దానిమీద చేరిపోతాయట. అందుకే.. పైన షెల్ తీసివేయగానే వీలైనంత తొందరగా దానిని తినేయాలి. లేదు అంటే.. దానిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

35

ఉడికించిన తర్వాత.. ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల.. బ్యాక్టీరియా పెరుగుదల  చాలా తక్కువగా ఉంటుంది.  ఎందుకంటే ప్రమాదకరమైన బ్యాక్టీరియా 40°F (4°C) కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో నెమ్మదిగా పెరుగుతుంది.కాబట్టి.. అప్పుడు కాస్త ఆలస్యంగా తిన్నా ఎలాంటి హాని ఉండదు. ఉడికించిన గుడ్లను రెండు గంటల కంటే ఎక్కువ సేపు గదిఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదట. రెండు గంటల్లో తింటే ఏం కాదు. అలా కాదు అంటే.. వాటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడమే ఉత్తమమైన పద్దతి.

45

ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని   గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయడం కూడా మంచిది. ఫ్రిజ్‌ని తరచుగా తెరవడం , మూసివేయడం వలన ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు మారవచ్చు.

55
peel boiled egg

peel boiled egg

లేదు.. మేము ఫ్రిడ్జ్ లో పెట్టాలి అనుకోవడం లేదు అంటే.. తినడానికి ముందు లేదంటే... కూరలో వేసే ముందు వరకు.. గుడ్డు పై షెల్ తీయకూడదు. తినడానికి ముందు తీసుకుంటే అప్పుడు ఎలాంటి భయం ఉండదు. షెల్ తీయనంత వరకు హెల్దీగానే ఉంటుంది. షెల్ తీసేసిన తర్వాత మాత్రం వెంటనే తినేయడం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved