MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Rice: షుగర్ ఉన్నవారు అన్నాన్ని ఎలా తినాలి?

Rice: షుగర్ ఉన్నవారు అన్నాన్ని ఎలా తినాలి?

Rice: అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ ను పెంచుతాయి. అన్నాన్ని డయాబెటీస్ ఉన్నవారు తింటే వెంటనే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే షుగర్ పుషెంట్లు అన్నాన్ని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 28 2025, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షుగర్ పేషెంట్లు అన్నం తింటే ఏమౌతుంది?
Image Credit : others

షుగర్ పేషెంట్లు అన్నం తింటే ఏమౌతుంది?

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ డయాబెటీస్ వల్ల శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాదు. శక్తి కోసం గ్లూకోజ్ ను కణాల్లోకి ఇదే పంపుతుందది. ఇది లేకపోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలోనే ఉంటుంది. దీంతో వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షుగర్ పేషెంట్లు అన్నం తింటే?
Image Credit : Getty

షుగర్ పేషెంట్లు అన్నం తింటే?

షుగర్ ఉన్నవారు ఇడ్లీ, దోశ, అన్నం వంటివి తక్కువగా తినాలి. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే  అన్నం తిన్నా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లాక్ రైస్ మంచివి

డయాబెటీస్ ఉన్నవారు అన్నాన్ని తినాలనుకుంటే వైట్ రైస్ ను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ముదురు రంగు అంటే బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ వంటి అన్నాన్ని వండుకుని తినొచ్చు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మోతాదులో తింటే షుగర్ లెవెల్స్ పెరగవు. 

బాయిల్డ్ రైస్ మంచిది

షుగర్ పేషెంట్లు బాయిల్డ్ రైస్ తింటే మంచిది, అందుకే రేషన్ బియ్యాన్ని తినాలంటారు. అయితే ఈ బియ్యాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా పెరుగుతాయి. బాయిల్డ్ రైస్ ను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Related Articles

Related image1
dussehra: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలంటారు?
Related image2
Bad Breath: నోట్లో నుంచి వాసన వస్తోందా? ఇలా చేయండి అస్సలు రాదు
35
అన్నాన్ని ఎలా తినాలి?
Image Credit : Getty

అన్నాన్ని ఎలా తినాలి?

షుగర్ ఉన్నవారు అన్నాన్ని తినేటప్పుడు కూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక వంతు అన్నం ఉంటే రెండు వంతుల కూర ఉండాలి. ఇలా తింటేనే షుగర్ పెరగదు. అలాగే ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినాలి. 

తక్కువగా తినాలి

డయాబెటీస్ పేషెంట్లు అన్నాన్ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ముఖ్యంగా అప్పుడే వండిన వేడి వేడి అన్నానికి బదులు చద్దన్నం తినడమే మంచిది. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అలాగే పొడవాటి అన్నాన్ని తినడం మంచిది. అంటే బాస్మతి బియ్యం వండుకుని తినొచ్చు. చిన్నగా ఉండే బియ్యంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాలైనా నడవాలి. 

45
షుగర్ పేషెంట్లు బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

షుగర్ పేషెంట్లు బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. 

కాబట్టి మీరు బరువు కూడా తగ్గుతారు. బ్రౌన్ రైస్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శుద్ధి చేసిన వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యల ప్రమాదాల్ని తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే బి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచుతాయి, అలాగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి నరాలను కాపాడుతాయి.

55
డయాబెటీస్ ఉన్నవారికి రెడ్ రైస్ ప్రయోజనాలు
Image Credit : Getty

డయాబెటీస్ ఉన్నవారికి రెడ్ రైస్ ప్రయోజనాలు

డయాబెటీస్ పేషెంట్లకు రెడ్ రైస్ కూడా ప్రయోజనకరంగా ఉంటుందది. దీనిలో ఫ్లేవనాయిడ్లు, ఆంథోనిసైనిన్లు వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే ఈ బియ్యానికి ఎరుపు రంగును ఇస్తాయి. అయితే ఈ పదార్థాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి.

 అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెరస్థాయిలను పెంచకుండా ఉండటానికి సహాయపడతాయి. వైట్ రైస్ కు బదులుగా షుగర్ పేషెంట్లు రెడ్ రైస్ ను కూడా తినొచ్చు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Dal Tadka: తాళింపు సీక్రెట్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా, వాసనకే కడుపునిండిపోద్ది
Recommended image2
Mutton Buying Tips: లేత మటన్ vs ముదురు మటన్.. ముక్కను చూడగానే కనిపెట్టేయండిలా !
Recommended image3
Chia Seeds: నీళ్లలో కలిపి కాకుండా.. పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
dussehra: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలంటారు?
Recommended image2
Bad Breath: నోట్లో నుంచి వాసన వస్తోందా? ఇలా చేయండి అస్సలు రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved