పెసర్లు తింటే ఏమౌతుందో తెలుసా?
పెసర్లను చాలా మంది మొలకలుగానే తింటుంటారు. కానీ వీటిని ఎన్నో విధాలుగా తినొచ్చు. కానీ వీటిని తినడం వల్ల మీరు పొందే లాభాలు ఒకటి రెండు కావు తెలుసా?
కాయధాన్యాల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది ప్రతిరోజూ కాయధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. కాయధాన్యాల్లో పెసర్లు ఒకటి. పెసర్లు రుచిగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి. అసలు పెసర్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పెసళ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పెసర్లను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెసర్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కొలెస్ట్రాల్ పేగుల్లోకి శోషించబడకుండా నిరోధిస్తుంది.
దీంతో ఇది మలవిసర్జన ద్వారా బయటకు వస్తుందని ఆరోగ్య నిపుణులు.కానీ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇదొక్కటే ఉపయోగపడదు. కానీ పెసర్లను తింటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.
మీకు తెలుసా? మన శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉండే అధిక రక్తపోటు ఆటోమెటిక్ గా అదుపులో ఉంటుంది. అలాగే పెసర్లలో మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబీపీని నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి దీంతో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ గుండె హెల్తీగా ఉంటుంది.
పెసర్లలో ప్రోటీన్ తో పాటుగా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంటే ఈ పప్పును తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు మధ్యమధ్యలో ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినకుండా ఉంటారు. ఈ విధంగా మీరు సులువుగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారికి పెసర్లు బాగా ఉపయోగపడతాయి.
పెసర పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ పప్పును డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. దీనని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే షుగర్ అదుపులో ఉంటుంది. మీరు డయాబెటీస్ పేషెంట్లు అయితే ఈ పప్పును ఖచ్చితంగా తినాలంటారు ఆరోగ్య నిపుణులు.
పెసర్లను ఎలా తినాలి?
పెసర్లను ఉడికించి తినొచ్చు
పెసర పప్పు మొలకలు
పచ్చి పెసరపప్పు సూప్
సలాడ్ లో వేసి తినొచ్చు
పెసర్ల కిచిడి