పిజ్జా, బర్గర్ తినాలనే కోరికను ఆపుకునేదెలా..?
అంతేకాకుండా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. సాధారణంగా ఇండియన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోరు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా ఆకలి అనిపించదు. ఇలాంటి ఫుడ్స్ తినాలనే భావన కూడా కలగదు.
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అని అడగగానే వెంటనే పిజ్జా, బర్గర్, శాండ్ విచ్ లాంటి పేర్లే చెబుతారు. అంతాలా ఈ ఫుడ్స్ అందరికీ చేరిపోయాయి. అయితే... ఇవి ఆరోగ్యానికి అంత మేలు చేయవు అనే విషయం మనకు తెలుసు. దాని వల్ల వివిధ రకాల సమస్యలు కూడా వచ్చేస్తాయి
కానీ.. బాగా అలవాటు అయిపోయిన ఫుడ్స్ కదా.. వాటికి దూరం కాలేకపోతున్నాం. కానీ.. ఈ కరోనా కాలంలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే వీటికి దూరంగా ఉండకతప్పదు. మరి.. వాటిపై ఇష్టాన్ని, కోరికను చంపుకోవాలంటే ఏం చేయాలో.. ఇప్పుడు చూద్దాం..
ఆకలిగా లేకున్నా,.. చాలా మందికి పిజ్జా, బర్గర్లు తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ముందు ఆ కోరికను చంపుకోవడానికి మంచినీరు తాగాలి. శరీరం డీ హైడ్రేట్ అయిన సమయంలోనూ ఆకలి మొదలౌతుంది. అందుకే.. జంక్ ఫుడ్ తినాలి అని అనిపించగానే.. ఒక పెద్ద గ్లాస్ నీరు తాగితే.. ఆకలి తీరుతుంది.. అంతేకాకుండా.. ఆ జంక్ ఫుడ్ తినాలనే భావన తగ్గుతుంది.
అంతేకాకుండా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. సాధారణంగా ఇండియన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోరు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా ఆకలి అనిపించదు. ఇలాంటి ఫుడ్స్ తినాలనే భావన కూడా కలగదు.
విపరీతంగా ఆకలి అయ్యేంత వరకు ఆగకూడదు. ఆకలి ఎక్కువగా వేసిన్పుడు.. ఇష్టమైన జంక్క్ష్ ఫుడ్స్ తినాలనే కోరిక మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి.. ఎక్కువ ఆకలి అయ్యేంత వరకు ఆగకుండా మధ్యలోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
నిద్ర... మనిషికి సరైన నిద్ర కూడా చాలా అవసరం. నిద్రలేమితో బాధపడేవారికి కూడా జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. ప్రతిరోజూ 7గంటల నిద్ర తప్పకుండా పోవాలి. అప్పుడు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం.. ఆకు కూరలు తినడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది.