Healthy Cooking: ఆరోగ్యకరంగా వంట చేయడం ఎలాగో తెలుసా?
Healthy Cooking: కూరలు టేస్టీగా అయితే చాలు.. ఎలా వండామన్నది ముఖ్యం కాదంటారు చాలా మంది. కానీ ఫుడ్ నోటికి టేస్టీగా ఉంటే సరిపోదు. మనం తిన్నదాన్నుంచి పోషకాలను పొందాలంటే మాత్రం ఫుడ్ ను కొన్ని పద్దతుల్లోనే వండాలంటారు నిపుణులు.

ఆరోగ్యకరమైన వంట చేయడం ఎలా?
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం చాలా అవసరం. అయితే ఈ ఆరోగ్యకరమైన ఆహారాల నుంచి మనం పోషకాలను పొందాలన్నా, వాటి ప్రయోజనాలు లభించాలన్నా వాటిని సరైన పద్దతిలో వండాలి. కానీ మనలో చాలా మంది వంటలను టేస్టీగా చేయడం కోసం ఏవేవో వేసి వండుతుంటారు. అలాగే ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తుంటారు. కూరలు నోటికి టేస్టీగా ఉంటే చాలనుకుంటారు. కానీ మనం తినే ఫుడ్ ఆరోగ్యకరమైందిగా ఉండాలంటే మాత్రం వంటను కొన్ని పద్దతుల్లో చేయాలి. అప్పుడే మనకు కూరగాయల నుంచి పూర్తి పోషకాలు అందుతాయి. లేదంటే వాటి నుంచి పోషకాలు అందక మనం పోషకాల లోపంతో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వంట ఎలా చేయకూడదు?
డీప్ ఫ్రై, ఎయిర్ ఫ్రై
చాలా మంది డీప్ ఫ్రై కూరలను ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిలో ఆయిల్ ఎక్కువగా పడుతుంది. వీటిని తింటే శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అందుకే డీప్ ఫ్రై కూరలను తినకూడదని అంటారు. అలాగే ఈ రోజుల్లో చాలా మంది ఎయిర్ ఫ్రై వంటను ఎక్కువగా చేస్తున్నారు. దీనిలో నూనె తక్కువగా పడుతుంది. కానీ దీనిలో వేడి గాలితో వంట అవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎయిర్ ఫ్రైలో వండితే అందులో కొన్ని రకాల నూనెలు ట్రాన్స్ ఫ్యాట్స్ ను తయమారుచేస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే వీటిలో కొన్ని కూరగాయలు ఎక్కువగా ఉడికితే.. మరికొన్ని తక్కువగా ఉడుకుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు.
గ్రిల్లింగ్
ఈ రోజుల్లో చాలా మంది గ్రిల్లింగ్ వంటలనే చేస్తున్నారు. ముఖ్యంగా చికెన్, చేపలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి కాల్చుతారు. దీనివల్ల వాటి నుంచి హెటెరోసైక్లిక్ ఆమైన్లు, పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్లు వంటి హానికరమైన మూలకాలు రిలీజ్ అవుతాయి. ఇది మనకు ఎన్నో ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా చేస్తుంది. అందుకే గ్రిల్ చేసిన వంటలను తినకూడదని అంటారు. దీనివల్ల వంటల నుంచి పోషకాలను పూర్తిగా పొందలేం.
నాన్ స్టిక్ పాన్
చాలా మంది ఆడవారు ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వీటిలో వంట చేయడం చాలా ఈజీ. కానీ ఇది హెల్తీ కుకింగ్ మెథడ్ మాత్రం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో తక్కువగా నూనె పట్టొచ్చు.. కానీ ఈ నాన్ స్టిక్ పాన్ పై ఉండే టెఫ్లాన్ పూత చాలా డేంజర్. దీన్ని ఎక్కువగా వేడి చేసినా.. ఈ పూత కొంచెం డ్యామేజ్ అయినా విషపూరితమైన పొగను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
మైక్రోవేవ్
మైక్రోవేవ్ ల వాడకం కూడా ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. కానీ దీనిలో వంట చేస్తే కూరగాయల్లోని పోషకాలన్నీ నాశనం అవుతాయి. అయితే చాలా మంది మైక్రోవేవ్ లో కొన్ని రకాల పాత్రల్లో ఫుడ్ ను వేడ్ ను వేడి చేస్తుంటారు. కానీ దీనివల్ల ఆ పాత్రలో కెమికల్ రిలీజ్ అయ్యి ఫుడ్ చేడిపోతుంది. దీన్ని తిన్న మన ఆరోగ్యం పాడవుతుంది. అందుకే మైక్రోవేవ్ లో ఉండకూడదని ఆరోగ్య నిపుణులు అంటారు.
వంటను ఆరోగ్యకరంగా తయారుచేయడం ఎలా?
బేకింగ్
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినడమే కాదు.. వీటిని హెల్తీ పద్దతిలో వండటం కూడా నేర్చుకోవాలి. అయితే బేకింగ్ హెల్తీ కుకింగ్ పద్దతే. బేకింగ్ అంటే ఓవెన్ లో చిన్న మంట మీద సమానంగా ఫుడ్ ను ఉడికించే పద్దతి. ఈ బేకింగ్ పద్దతిలో సీఫుడ్, కూరగాయలు, పౌల్ట్రీ, రొట్టెలు వంటి వంటలను చేయొచ్చు.
ప్రెజర్ కుకింగ్
ప్రెజర్ కుకింగ్ కూడా ఆరోగ్యకరమైన వంట పద్దతి. ప్రెజర్ కుకింగ్ అంటే ఫుడ్ ను వండటానికి గాలి వెళ్లని ప్రెజర్ కుక్కర్ లో వండటం. ప్రెజర్ కుక్కర్ లో వంట చాలా తొందరగా అవుతుంది. ఈ ప్రెజర్ కుక్కర్ లో మీరు సూప్ లు, పప్పు చారులు, మటన్, అన్నం, స్టాక్ లు వంటి వంటలను కుక్ చేయొచ్చు.
నెమ్మదిగా వంటచేయడం
తక్కువ మంట మీద నెమ్మదిగా వంట చేయడం కూడా మంచి పద్దతి. దీనిలో ఎక్కువ సేపు ఫుడ్ ను వండుతారు. అది కూడా తక్కువ మంట మీద. ఇందుకోసం మీరు స్లో కుక్కర్ లను ఉపయోగించొచ్చు. వీటిలో ఫుడ్ ను పెట్టి మీరు ఇతర పనులను చేసుకోవచ్చు. కానీ ఇది హెల్తీ ఫుడ్ ను తయారుచేస్తుంది. ఈ పద్దతిలో మీరు సూప్ లు, స్టూలు , క్యాస్రోల్స్ వంటి వంటలను చేయొచ్చు.
స్టిర్-ఫ్రైయింగ్ లేదా సాటీయింగ్
స్టిర్-ఫ్రైయింగ్, సాటీయింగ్ పద్దతిలో వండినా ఫుడ్ లోని పోషకాలు ఎటూ పోవు. మీ శరీరానికి పూర్తిగా అందుతాయి. ఈ పద్దతిలో ఆహార ముక్కలను చిన్నగా, సన్నగా కట్ చేస్తారు. వీటిని తక్కువ నూనె, వాటర్ ను ఉపయోగించి వేయించి తయారుచేస్తారు. ఈ పద్దతిలో చేపలను, కూరగాయలను, టోఫు వంటి ఆహారాలను వండొచ్చు.
స్టీమింగ్
స్టీమ్ చేసిన ఆహారాలతో కూడా కూరగాయల్లోని పోషకాలన్నీ అందుతాయి. ఈ పద్దతిలో స్టవ్ టాప్ పై లేదా మైక్రోవేవ్ లో వేడి నీటి ఆవిరిలో కూరగాయల్ని లేదా ఇతర ఆహారాలను ఉడికిస్తారు. దీనివల్ల ఆ కూరగాయల్లోని పోషకాలు తగ్గవు. ఈ పద్దతిలో మీరు క్యారెట్లు, కూరగాయల్ని, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి వాటిని ఉడికించొచ్చు.