ఈ బ్రేక్ ఫాస్ట్ లు తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు..!
ఈ ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లు తీసుకోవడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
breakfast
బరువు తగ్గడం అంత సులభం కాదు. బరువు పెరగడం సులభమే కానీ.. తగ్గించడానికి మాత్రం చాలానే కష్టపడాలి. అయితే.. ఎలా కష్టపడాలి అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. అసలు బరువు తగ్గడం అనేది.. మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుందట. ఎంత ఫిజికల్ గా కష్టపడినా.. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గలేరు. కాబట్టి.. ముఖ్యంగా ఆహారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని నిపుణులు చెబుతున్నారు.
breakfast
అయితే... ఈ ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లు తీసుకోవడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
1.పోహ
పోహ.. ఈ బ్రేక్ ఫాస్ట్ నోటికి రుచిని అందజేయడంతోపాటు.. ఆరోగ్యాన్ని సైతం అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోహలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది చాలా సులభంగానే జీర్ణమౌతుంది. గొప్ప ప్రోబయోటిక్ అని కూడా చెప్పొచ్చు దీనిని ఆల్పాహారంగా తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
2.మూంగ్ దాల్ చిలా
ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్ గా మూంగ్ దాల్ చెప్పొచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. ఎక్కువ సేపు ఆకలిని నియంత్నించడంలోనూ ఇది సహాయం చేస్తుంది. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. రాత్రిపూట మూంగ్ దాల్ ని నానపెట్టాలి. దానిని ఉదయాన్నే శుభ్రం చేసి.. ఏవైనా ఆకుకూరలు, ఉల్లిపాయలు లాంటివి వేసి.. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని చపాతిలాగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది.
Dalia Upma
3.వెజిటేబుల్ దాలియా..
దాలియాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని సూపర్ ఫుడ్ గా చెప్పొచ్చు, మీకు నచ్చిన విధంగా దీనిని ఉడికించుకోవచ్చు. తీపిగానూ, కారంగానూ చేసుకోవచ్చు. కూరగాయలతో కలిపి దాలియా చేసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చు.
Sprouts
4.మొలకలతో సలాడ్..
మొలకల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ మొలకలతో కూరగాయలు కలిపి సలాడ్ లా చేసుకొని తినడం వల్ల మరింత సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే.. దీనిలో.. ఉప్పు చాలా తక్కువగా వేసుకోవడం మంచి అలవాటు. కారానికి బదులు.. మిరియాల పొడి, చాట్ మసాలా లాంటివి వాడాలి. దీనిలో మూంగ్ దాల్, చనాదాల్ లాంటివి రకరకాల పప్పు దినుసులు కలుపుకోవచ్చు.
5.కోడిగుడ్డు..
బరువు తగ్గాలని అనుకునేవారు.. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా అందించాలి. అప్పుడే వారు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. కాబట్టి.. బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్డు తీసుకుంటే.. శరీరానికి ప్రోటీన్ అందడంతోపాటు.. బరువు కూడా సులభంగా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉడకపెట్టిన గుడ్డు తింటే.. ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు.
6.అరటిపండు..
క్యాలరీలు తక్కువ.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి అనుకునేవారికి అరటిపండు బెస్ట్ సోర్స్. బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండు తినేవారు కూడా సులభంగా బరువు తగ్గుతారు.