MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చపాతీ, రొట్టెలను మొత్తమే తినకపోతే ఏమౌతుందో తెలుసా?

చపాతీ, రొట్టెలను మొత్తమే తినకపోతే ఏమౌతుందో తెలుసా?

కొంతమంది చపాతీలను గానీ, జొన్న రొట్టెను గానీ రోజూ తింటుంటారు. అలాగే మరికొంతమంది మాత్రం వీటి జోలికే వెళ్లరు. కానీ వీటిని మొత్తమే తినకపోతే ఏమౌతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 21 2025, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. ఆరోగ్యంగా ఉండాలని రకరకాల ఆహారాలను తమ రోజువారి డైట్ లో చేర్చుకుంటున్నారు. కొన్ని ఆహారాలను తినకుండా అవాయిడ్ చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది బరువు విషయంలో ఎన్నో జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇవి తింటే బరువు పెరుగుతారంటే వాటిని పూర్తిగా మానేస్తున్నారు. బరువు పెరగకుండా చేసే ఆహారాలను రోజూ తింటున్నారు. అయితే చాలా మందికి గోధుమ చపాతీ లేదా జొన్న రొట్టెను రోజూ తినే అలవాటు ఉంటుంది. నిజానికి ఇవి అన్నం కంటే చాలా మంచివి. కానీ వీటిలో కూడా కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు గోధుమ చపాతీలకు దూరంగా ఉంటున్నారు. కానీ రోటీని తినకపోతే ఏమౌతుందో తెలుసా? 
 

35

రొట్టెలను తినపోతే ఏం జరుగుతుంది?

మీ రోజువారి ఆహారం నుంచి రోటీ లేదా కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలన్ని చేర్చకపోవడం వల్ల మీరు మొదట్లో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారేమో. కానీ రానురాను దీనివల్ల మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రొట్టెను మానేసిన ఫస్ట్ నెలలో మీకు ఉబ్బరం తక్కువగా ఉంటుంది.

అలాగే మీ ముఖం సన్నగా అవుతుంది. అలాగే మీకు మరింత శక్తివంతంగా అనిపిస్తుంది. కానీ కాలక్రమేణా దీనివల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కార్బోహైడ్రేట్లు అంటే రోటీలు, రొట్టెలు మన మెదడుతో సహా మొత్తం శరీరానికి ప్రధాన శక్తి  వనరు. వీటిని తినకపోతే మీరు బలహీనంగా, అలసటగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 
 

45

రొట్టెను తినకపోవడం వల్ల వచ్చే సమస్యలు 

రొట్టెను తినకపోవడం వల్ల మీ శరీరంలో తగినన్ని కార్భోహైడ్రేట్లు ఉండవు. దీంతో మీ శరీరంలో శక్తి కొరతను తీర్చడానికి ప్రోటీన్ ను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి బదులుగా  కండరాల నష్టానికి దారితీస్తుంది. అలాగే దీనివల్ల మీ జీవక్రియ నెమ్మదిస్తుంది.

దీంతో మీరు బరువు తగ్గడం మరింత కష్టంగా మారుతుంది. దీనివల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గరు. అంతేకాదు  రొట్టె వంటి వనరుల నుంచి సరైన ఫైబర్ అందకపోవడం వల్ల పేగు కదలికలు మందగిస్తాయి. దీంతో మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. 
 

55

రక్తంలో చక్కెర, ఆరోగ్యంపై ప్రభావాలు

కార్బోహైడ్రేట్లను తక్కువ మొత్తంలో తీసుకుంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలపై, మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అయితే మొదట్లో మీరు చపాతీ తినకపోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది.  ఇన్సులిన్ వచ్చే చిక్కులను తగ్గిస్తుంది. అయినప్పటికీ కార్బోహైడ్రేట్లను తీసుకోకపోవడం వల్ల మీ ఒంట్లో స్టామినా ఉండదు. దీనివల్ల కొంతమందికి మెదడు పనితీరు మందగిస్తుంది. అలాగే దృష్టి ప్రభావితం అవుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved