పాలకు మించిన కాల్షియం వీటిలో ఉంటుంది...!
పాల ఉత్పత్తుల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న అనేక ఇతర ఆహారాలు ఉన్నాయి. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.
పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. శరీరంలో కాల్షియం తక్కువ అయితే... ఎముకలు బలహీనంగా తయారౌతాయి. ఈ సమస్య వయసు పెరిగేకొద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పాలు, వెన్న, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులు ఉత్తమ కాల్షియం రిచ్ ఫుడ్స్ అని చెబుతారు. వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
calcium
అయితే.... పాల ఉత్పత్తుల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న అనేక ఇతర ఆహారాలు ఉన్నాయి. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. కాల్షియం మన శరీరానికి చాలా అవసరం, ఇది మన హృదయ స్పందన రేటు, కండరాల సంకోచాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇలా శరీరంలో కాల్షియం లోపిస్తే, హైపోకాల్సీమియా వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. దీని ప్రధాన లక్షణాలు గందరగోళం, కండరాలలో నొప్పి, ఎముకలు బలహీనత మొదలైనవి కనిపిస్తాయి. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే రోజూ కొన్ని ఇతర పదార్థాలతో పాటు పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
soya
సోయా మిల్క్
కొంతమందికి, పాలు, పాల ఉత్పత్తులు (డైరీ ప్రొడక్ట్స్)) ఉపయోగించడం వల్ల వివిధ రకాల అలర్జీలు వస్తూ ఉంటాయి. బదులుగా సోయా పాలు ఉపయోగించవచ్చు. సోయా పాలలో మంచి కాల్షియం ఉంటుంది. బాదం పాలు కూడా తీసుకోవచ్చు.
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్
పాలక్‌తో సహా అనేక రకాల ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఈ ఆకుపచ్చ కూరగాయలు కాల్షియం కంటెంట్‌ను సరిగ్గా గ్రహించడంలో సహాయపడతాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి అద్భుతమైనవి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫోలేట్, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6 ఉంటాయి. ఇలా రోజూ పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు జరుగుతుంది.
బీన్స్, పప్పులు
బీన్స్, పప్పులు కూడా కాల్షియం మరొక అద్భుతమైన మూలం, పాల ఉత్పత్తులే కాకుండా వీటిని వినియోగించవచ్చు. వీటిలో, కాల్షియం కంటెంట్‌తో పాటు ప్రోటీన్, ఫైబర్ గరిష్ట స్థాయిలో లభిస్తాయి. ఇవి మన జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తాయి. అందువల్ల, అవి మన శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.
nuts
nuts
వివిధ రకాల గింజలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. వీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బాదంపప్పులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ , ప్రొటీన్లు ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచిది.