MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Food
  • కిడ్నీ స్టోన్స్ తగ్గాలన్నా, రాకుండా ఉండాలన్నీ వీటిని ఖచ్చితంగా తినండి

కిడ్నీ స్టోన్స్ తగ్గాలన్నా, రాకుండా ఉండాలన్నీ వీటిని ఖచ్చితంగా తినండి

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి మన రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, మన శరీరం నుంచి విషాన్ని బయటకు తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మీరు తినే ఆహారం, జీవనశైలి, కొన్ని వ్యాధుల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అయితే మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఫుడ్ ఎంతో సహాయపడుతుంది.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 03 2024, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మూత్రపిండాలు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అలాగే శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపుతాయి. రక్తాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత.. ఇవి మూత్రంతో విషాన్ని బయటకు పంపుతాయి. అయితే మూత్రపిండాల పనితీరులో ఏదైనా ఆటంకం ఏర్పడితే మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు మన రక్తంలోనే ఉండిపోతాయి. దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. మన జీవనశైలి, అధిక బరువు లేదా మరేదైనా వ్యాధి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. నిజానికి మూత్రపిండాల్లో రాళ్లు.. ఖనిజాలు, లవణాలతో ఏర్పడుతాయి. ఇవి ఇసుక రేణువుల లాగే చిన్నవి నుంచి టెన్నిస్ బంతి లాగ పెద్దగా ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కిడ్నీ స్టోన్స్ లక్షణాలు

మూత్ర విసర్జన చేసేటప్పుడు విపరీతమైన నొప్పి
మూత్రం సమయంలో రక్తం
వెన్నునొప్పి
వికారం, వాంతులు 
తరచుగా మూత్రవిసర్జన
మూత్రంలో మంట
దిగువ కటిలో నొప్పి
జ్వరం
మూత్ర ఇన్ఫెక్షన్
మూత్రం వాసన

38

ఈ లక్షణాలతో కిడ్నీల్లో రాళ్లను గుర్తించొచ్చు. సాధారణంగా ఈ రాళ్లు మూత్రంతో పాటుగా బయటకు వస్తాయి. కానీ కొన్నిసార్లు ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇలాంటప్పుడు శస్త్రచికిత్స అవసరం కావొచ్చు. అందుకే కిడ్నీలో రాళ్లను నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఉత్తమ మార్గం పుష్కలంగా నీటిని తాగడం. వీటితో పాటు కిడ్నీ స్టోన్స్ నివారించడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

48

బ్రోకలీ

బ్రోకలీలో తక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఈ ఆక్సలేట్ యే మూత్రపిండాల్లో రాళ్లకు అతిపెద్ద కారణం. అందుకే మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో బ్రోకలీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది 90 శాతం నీటితో తయారవుతుంది. ఇది మూత్రపిండాల సమస్యతో బాధపడేవారికి ఇది ప్రయోజకరంగా ఉంటుంది. 
 

58

పుచ్చకాయ

పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆక్సలేట్ రాళ్లుగా ఏర్పడనివ్వదు. అందుకే పుచ్చకాయ తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారించొచ్చు. అలాగే వీటిలో వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల  కిడ్నీ పేషెంట్లకు ఎంతో మేలు జరుగుతుంది. 
 

 

68
curd

curd

పెరుగు

పెరుగులో కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇది ఆక్సలేట్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం బాగా తగ్గుతుంది. అలాగే కిడ్నీ పేషెంట్లకు పాలు, జున్ను కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
 

78

నారింజ

నారింజలు సిట్రిక్ ఆమ్లానికి మంచి వనరులు. ఇది మూత్రపిండాల్లో రాళ్ల నుంచి రక్షించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వీటితో పాటుగా నిమ్మకాయ తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి. 
 

88
Image: Getty

Image: Getty

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. స్ట్రాబెరీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఆక్సలేట్ పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా బ్లూ బెర్రీలను తినడం వల్ల మీ మూత్రపిండాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved