వంటకు ఆవ నూనెను వాడితే ఏమౌతుంది?
ఒక్కొక్కరు ఒక్కో రకమైన వంటనూనెను ఉపయోగిస్తారు. కానీ ఎవ్వరైనా సరే ఆరోగ్యానికి మేలు చేసే వంట నూనెనే ఉపయోగించాలి. అయితే వంటకు ఆవనూనెను ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వంటనూనె లేకుండా ఏ కూరలూ కావు, వంటా కాదు. నూనెతోనే కూరలు టేస్టీగా అవుతాయి. అయితే మనకు మార్కెట్ లో రకరకాల వంట నూనెలు దొరుకుతాయి. అందులో నచ్చిన వాటిని కొని వాడుతుంటారు. కానీ చాలా వంటనూనెలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా? అందుకే ఒక వంట నూనెను వాడుతున్నామంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే చెడు వంటనూనెలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వంట నూనె మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే వంట నూనెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ధర, ఎక్కువ ధర అని చూడకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే వంట నూనెలనే ఉపయోగించాలి. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, ఆలివ్ నూనె, పామాయిల్ వంటి నూనెలను వంటకు బాగా ఉపయోగిస్తారు. వీటిలో ఆవ నూనె ఒకటి. నిజానికి ఈ ఆవనూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అసలు వంటకు ఆవ నూనెను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోషకాలు
ఆవ నూనెను వంటకు వాడటం వల్ల ఎంత వేడి వద్ద ఉడికించినా కూరలోని పోషకాలను మాత్రం తగ్గనీయదు. అంటే ఈ నూనెను ఉపయోగించడం వల్ల వంటల్లోని పోషకాలు తగ్గవు. మన శరీరానికి పుష్కలంగా అందుతాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతే కాదు ఆవ నూనె ఫుడ్ రుచిని కూడా బాగా పెంచుతుంది. అందుకే చాలా మంది దీనికి వంటకు బాగా ఉపయోగిస్తారు. ఎంత వేడికి ఉడికించినా ఈ నూనె కూరల టేస్ట్ ను మాత్రం అస్సలు మార్చదు. దీనివల్లే చాలా మంది ఈ నూనెను వంటకు వాడుతారు.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం మంచి విషయం కాదు. ఎందుకంటే దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి. అయితే ఆవనూనె మీ రోజువారి వంటకు వాడితే గనుక మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ కరగడం మొదలవుతుంది. ఎందుకంటే ఆవనూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది
మన ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ ఆవనూనె మన రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.
జీర్ణక్రియ సజావుగా సాగుతుంది
ఆవనూనెతో వండిన ఆహారాల్ని తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే తిన్న ఆహారం సజావుగా జీర్ణమవుతుంది. దీనిని తింటే అజీర్ణం అనే సమస్యే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ ఈ అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుంది. అయితే ఆవనూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది రక్త నాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హైబీపీని కంట్రోల్ చేస్తుంది.