MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రసం తో ఇన్ని లాభాలున్నాయా?

రసం తో ఇన్ని లాభాలున్నాయా?

మనలో చాలా మందికి రసం అంటే ఎంతో ఇష్టం. మరియాలు, జీలకర్ర మొదలైన మసాలా దినుసులతో తయారుచేసే ఈ రసం ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది తెలుసా? అవును రసాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 23 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

రసం ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. కొంతమంది అన్నంతో పాటు తింటారు. టమాటాలు, చింతపండు, మిరియాలు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులతో తయారు చేసే రసంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ఔషదగుణాలున్నాయి. రసాన్ని అన్నంతో పాటు తినొచ్చు లేదా భోజనం తర్వాత సూప్ గా తాగొచ్చు. దీన్ని ఎలా తీసుకున్నా దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

చింతపండు రసం, పసుపు, నల్ల మిరియాలు, ఆవాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు ఉండే రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది పోషక-దట్టమైన ఆహారాలలో ఒకటిగా  చేరింది. మీకు తెలుసా? రసంలో విటమిన్లు, ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.

34

రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ మెండుగా ఉంటాయి. రసంలో ఉండే నల్ల మిరియాలు మన జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. రసంలో వేసిన చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచడానికి సహాయపడుతుంది.

44

మలబద్ధకం వంటి ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారికి రసం దివ్యౌషధం. దీనిలో ఉపయోగించే చింతపండులో డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇక రసంలో ఉండే నల్ల మిరియాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మన శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. దీంతో మన శరీర మెటబాలిజం సక్రమంగా పనిచేస్తుంది.  ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?
Recommended image2
Ice Cream: పాలు లేకుండానే ఐస్ క్రీమ్..తింటే ఐసైపోతారు..డైట్ చేసేవాళ్లకి క్రేవింగ్ తీరిపోద్ది
Recommended image3
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved