MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మోసాంబి జ్యూస్ ను రోజూ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

మోసాంబి జ్యూస్ ను రోజూ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

మోసాంబి జ్యూస్ మంచి పోషకాల నిధి. దీన్ని రోజూ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ మనల్ని ఎన్నో ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. అలాగే..

2 Min read
Author : R Shivallela
Published : Oct 06 2023, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మోసాంబిలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ జ్యూస్ ను సీజన్లతో సంబంధం లేకుండా తాగొచ్చు. ఈ పండ్లు ఏడాది పొడవునా మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి,కాల్షియం, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇలాంటి పండు జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. అసలు ఈ జ్యూస్ ను తాగితే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బరువు తగ్గడానికి.. 

బరువు తగ్గేందుకు ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారికి మోసాంబిలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఈ పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మోసాంబి జ్యూస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతో సహయపడుతుంది. 
 

36

మలబద్ధకం నుంచి ఉపశమనం.. 

నీళ్లను తక్కువగా తాగడం నుంచి ఫైబర్ ను తీసుకోకపోవడం వరకు.. మలబద్దకానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మోసాంబి జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మలబద్దకం సమస్య ఇట్టే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పండులో ఉండే యాసిడ్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

46

రోగనిరోధక శక్తి బలంగా.. 

మోసాంబిలు పోషకాల నిధి. ఇదిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తాగితే మనం ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటాం. 

56
mosambi juice

mosambi juice

ఎముకలు దృఢంగా.. 

మోసాంబిలు మన ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మోసాంబి జ్యూస్ పుష్కలంగా ఉండే క్యాల్షియం మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీకు కీళ్ల నొప్పులు ఉంటే మోసాంబి జ్యూస్ ను రెగ్యులర్ గా తాగండి. ఇది నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

66
mosambi

mosambi

చర్మానికి మేలు.. 

తులసి జ్యూస్ మన చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో ఉండే విటమిన్  సి స్కిన్ కలర్ ను మెరుగుపరుస్తుంది. అలాగే  మొటిమలు, మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?
Recommended image2
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?
Recommended image3
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved