MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • ఈ విషయం తెలిస్తే వంకాయలను తినకుండా ఉండలేరు.. వంకాయలతో ఎన్ని రోగాల రిస్క్ తగ్గుతుందో తెలుసా?

ఈ విషయం తెలిస్తే వంకాయలను తినకుండా ఉండలేరు.. వంకాయలతో ఎన్ని రోగాల రిస్క్ తగ్గుతుందో తెలుసా?

వంకాయలో పొటాషియం, సోడియం, కాల్షియం, జింక్, ఐరన్, ఫోలే, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషయం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వంకాయలను తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 29 2023, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వంకాయ ఎన్నో పోషక ప్రయోజనాలను కలిగి ఉన్న కూరగాయ. వంకాయలో పొటాషియం, సోడియం, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ కూరగాయలను తినని వారు చాలా మందే ఉన్నారు. కారణం దీనిపై ఉన్న అపోహలే. నిజానికి వంకాయ ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. దీని ప్రయోజనాలను తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. వంకాయను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జీర్ణక్రియ

వంకాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వంకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య కూడా పోతుంది.

గుండె ఆరోగ్యం

వంకాయను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వంకాయ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం, విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్న వంకాయ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వంకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

35

అధిక రక్తపోటు

పొటాషియం పుష్కలంగా ఉండే వంకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే హై బీపీ పేషెంట్లు వీటిని తినాలని చెబుతుంటారు. 

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి వంకాయ కూడా ఎంతో సహాయపడుతుంది. వంకాయలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

45

బ్లడ్ షుగర్

వంకాయల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినొచ్చు. ఆహారం నుంచి గ్లూకోజ్ శోషణను నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

ఎముకల ఆరోగ్యం

ఫినోలిక్ సమ్మేళనాలు , కాల్షియం ఎక్కువగా ఉండే వంకాయ ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.

రక్తహీనత

ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే వంకాయను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్యను పోగొట్టొచ్చు. 
 

55


క్యాన్సర్ ప్రమాదం

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వంకాయను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

మెదడు 

మెదడు పనితీరును నియంత్రించే ఆహారాలలో వంకాయ ఒకటి. వంకాయలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి.

వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వంకాయల్లో కలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును తొందరగా నింపుతుంది. ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved