MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రోజూ గుప్పెడు పిస్తాలను తింటే ఈ రోగాలన్నీ దూరం..

రోజూ గుప్పెడు పిస్తాలను తింటే ఈ రోగాలన్నీ దూరం..

పిస్తా పప్పులో మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 13 2023, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పిస్తాపప్పు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పప్పులు మనల్ని ఎన్నో రోగాల నుంచి కూడా కాపాడుతాయి తెలుసా? ఈ పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిస్తాపప్పులో కాల్షియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ ఎ, బి6, కె, సి, ఇ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ గుప్పెడు పిస్తా పప్పులను తీసుకుంటే మీ ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటుంది. ఎన్నో రోగాల ముప్పు కూడా తప్పుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ గుప్పెడు పిస్తాలను తింటే ఏయే రోగాల ముప్పు తప్పుతుందో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

29

చెడు కొలెస్ట్రాల్

పిస్తాపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ గింజలను తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గుతుంది. పిస్తాపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటుగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

39

రక్తపోటు నియంత్రణ

పిస్తాపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుంది.
 

49

గట్ ఆరోగ్యం

పిస్తాలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ గట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మంచి జీర్ణక్రియ కోసం పిస్తాపప్పును కూడా క్రమం తప్పకుండా తినొచ్చు.
 

59

డయాబెటీస్ నియంత్రణ

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా పిస్తాపప్పులు సహాయపడతాయి. పిస్తాపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పిస్తాపప్పును తమ ఆహారంలో చేర్చొచ్చు.

69

ఊబకాయం తగ్గుతుంది

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పిస్తాపప్పును తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. దీనివల్ల మీరు  ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

79

హిమోగ్లోబిన్ స్థాయి మెరుగు

కంటి ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి కూడా పిస్తాపప్పు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. పిస్తాపప్పులో ఉండే విటమిన్ బి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించడానికి, మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
 

89

ప్రోటీన్

పిస్తాపప్పు ప్రోటీన్ కు భాండాగారం. 100 గ్రాముల పిస్తాపప్పులో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి మన శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. గర్భిణీ స్త్రీలు తినాల్సిన వాటిలో ఇవీ ఒకటి. పిస్తాపప్పులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

99

చర్మ ఆరోగ్యం

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే పిస్తాపప్పు మన చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

మంచి నిద్ర

మనకు నిద్రపోవడానికి సహాయపడే మెలటోనిన్ ఎక్కువగా ఉండే గింజల్లో పిస్తా ఒకటి. రాత్రి భోజనం చేసిన తర్వాత కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Recommended image2
Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ
Recommended image3
Curd Tips: స‌మ్మ‌ర్‌లో పెరుగు పుల్ల‌గా కాకుండా, గ‌ట్టిగా ఉండాలంటే ఏం చేయాలి.? సింపుల్ చిట్కాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved