MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • పచ్చి మిరపకాయలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

పచ్చి మిరపకాయలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

పచ్చిమిరపకాయలను రెగ్యులర్ గా తినేవారున్నారు. కానీ ఇవి మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అని మాత్రం ఎవరూ తెలుసుకోరు. తెలుసుకునేందుకు కూడా ప్రయోత్నించరు. ఆరోగ్యనిపుణుల ప్రకారం.. పచ్చి మిరపకాయలను తినడం వల్ల ఏమౌతుందంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 17 2023, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పచ్చి మిరపకాయలు కూరలను టేస్టీగా చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని రెగ్యలర్ గా కూరల్లో వేస్తుంటారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి మిరపకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవును పచ్చి మిరపకాయల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. మీరు రెగ్యలర్ గా  తినే ఆహారంలో పర్చిమిరపకాయలను చేర్చుకుంటే ఎన్నో రోగాలు తగ్గుతాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

పచ్చిమిరపకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, కాపర్, ప్రోటీన్, ఐరన్,  పొటాషియం, బీటా కెరోటిన్ వంటి మూలకాలు మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. మరి పచ్చి మిరపకాయలను రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 
 

39

రోగనిరోధక శక్తి బలోపేతం 

చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. దీనివల్లే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మీరు పచ్చిమిరపకాయలను రోజూ తింటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇవే మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీంతో ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పు తప్పుతుంది. 
 

49

రక్తపోటు అదుపు 

అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడా పచ్చి మిరపకాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఎలా అంటే పచ్చి మిరపకాయల్లో ఉండే యాంటీహైపర్టెన్సివ్ లక్షణాలు అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.

59
Image: Freepik

Image: Freepik

కళ్ల ఆరోగ్యం 

పచ్చి మిరపకాయలు కూడా మన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ పచ్చి మిరపకాయలను తింటే కళ్లు మెరుగ్గా కనిపిస్తాయి. ఎలా అంటే వీటిలో కళ్లకు మేలుచేసే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కంటిచూపును పెంచడానికి సహాయపడతాయి. 
 

69

బరువు తగ్గడానికి

పచ్చి మిరపకాయలు కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అవును వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 
 

79

డయాబెటిస్ 

డయాబెటీస్ పేషెంట్లకు కూడా పచ్చి మిరపకాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో ఒక్క పచ్చిమిరపకాయను చేర్చుకున్నా మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయల్లో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. 
 

89

కొలెస్ట్రాల్ అదుపులో

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటు వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అయితే పచ్చి మిరపకాయలు ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. పచ్చి మిరపకాయల్లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

99
Chillies

Chillies

చర్మ ఆరోగ్యం 

రోజూ ఒక పచ్చిమిరపకాయలను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను నంయ చేయడానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved