ఈ చిన్న గింజలు చలికాలంలో ఔషధం లాంటివి.. ఎందుకో తెలుసా?
ఈ వామును ఒక గ్లాసు వాటర్ లో కలిపి తీసుకుంటే.. చలికాలంలో ఔషధంలా పని చేస్తుందట. మరి.. రోజూ వాము వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…
చలికాలంలో మనల్ని అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. జలుబు, జ్వరం, దగ్గు, జీర్ణ సమస్యలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే.. ఆ సమస్యలన్నింటినీ కేవలం చిన్న గింజలతో చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా? ఆ చిన్న గింజలు మరేంటో కాదు.. వాము. ప్రతి ఒక్కరి కిచెన్ లో కామన్ గా వాము ఉంటూనే ఉంటుంది. ఈ వామును ఒక గ్లాసు వాటర్ లో కలిపి తీసుకుంటే.. చలికాలంలో ఔషధంలా పని చేస్తుందట. మరి.. రోజూ వాము వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…
1.అంటు వ్యాధులకు చెక్…
వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని నిరోధించడంలో ఈ వాము వాటర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాములో యాంటీ మైక్రోబయల్, యాంటీ పారాసిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినా… వారం రోజులు ఈ నీరు తాగినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
Ajwain
జీర్ణక్రియకు మంచిది
వాము నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీరు వేగంగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది.
ajwain water
శ్వాస సమస్యలకు పరిష్కారం
ఉదయాన్నే వాము నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడి శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. ఆస్తమా రోగులకు ఈ నీరు చాలా మంచిది.
బరువు తగ్గడం..
ఈ వాము నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ నీరు మీ జీవక్రియను పెంచుతుంది. మీ శరీర బరువును ఆరోగ్యంగా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది.
పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం..
వాము వాటర్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నెలసరి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది వ్యక్తిని బట్టి మారవచ్చు.
జలుబు ,దగ్గు తగ్గిస్తుంది..
వాము నీటిని తాగడం వల్ల నాసికా రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం నుండి శ్లేష్మం తొలగించేలా చేస్తుంది. జలుబు, దగ్గు, ఛాతీ సమస్యలు ఉన్నవారు ఈ వాము నీరు తాగడం చాలా అవసరం.
వాము నీరు ఎలా తయారు చేయాలి?
ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల వాము గింజలు వేసి దాదాపు 10 నిమిషాలపాటు మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడపోసి.. గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగితే సరిపోతుంది.