MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • కొత్తిమీరను రోజూ తింటే ఇలా అవుతుందా?

కొత్తిమీరను రోజూ తింటే ఇలా అవుతుందా?

కొత్తిమీరను ప్రతి వంటలో వేస్తుంటారు. ఎందుకంటే ఇది ఫుడ్ టేస్ట్ ను పెంచుతుంది. కొత్తిమీర ఆకులనే కాదు కొత్తిమీర గింజలు అంటే ధనియాలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరి కొత్తమీరను రోజూ ఉపయోగించడం వల్ల ఏమౌతుందో తెలుసా? 

2 Min read
Author : R Shivallela
Published : Sep 29 2023, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిజీ బిజీ లైఫ్ స్టైల్, నిశ్చల జీవన శైలి మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా డయాబెటీస్, గుండె జబ్బులు, రక్తపోటు సంబంధిత వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి వ్యాధులు మనకు రావొద్దంటే మన రోజువారి ఆహారంలో కొన్ి మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

26
coriander leaves

coriander leaves

ప్రతి వంటింట్లో ఎన్నో రకాల మసాలా దినుసులు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఇలాంటి వాటిలో కొత్తిమీర ఒకటి. అవును కొత్తిమీర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఫుడ్ రుచిని బాగా పెంచుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

36
coriander

coriander

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అయితే కొత్తిమీరను రోజూ తింటే ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

46
coriander

coriander

మన దేశంలో ప్రతి వంటగదిలో కొత్తిమీర ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన మసాలా దినుసు కూడా . ఇది ఫుడ్ రుచిని బాగా పెంచుతుంది. అంతేకాక దీనిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. అందుకే దీన్ని పురాతన కాలం నుండి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. పురాతన కాలంలో ఈజిప్షియన్లు, గ్రీకులు దీన్ని జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగించారు. ప్రస్తుతం కొత్తిమీర ఆకులను, గింజలను, పొడిగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ కొత్తిమీర ఆకులు, విత్తనాలు వేర్వేరు రుచిని కలిగి ఉంటాయి. 
 

56
coriander

coriander

కొత్తిమీర కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గిస్తుంది? 

కొత్తిమీరలో సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఎల్డిఎల్ లేదా 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్తిమీర అథెరోస్క్లెరోసిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

66
coriander

coriander

కొత్తిమీరను మన ఆహారంలో ఎలా చేర్చాలి?

శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి దీన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. కొత్తిమీర ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా గుండెకు కూడా మేలు చేస్తుంది. కొత్తిమీర రుచి, పోషకాల కోసం మీరు తాజా కొత్తిమీర ఆకులను సూప్లు, సలాడ్లు, స్టిర్-ఫ్రైస్ లో చేర్చొచ్చు. అలాగే కొత్తిమీర విత్తనాలను మసాలా దినుసుగా కూడా ఉపయోగించొచ్చు.

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Fluffy Puri: పూరీలు పొంగాలంటే ఈ మ్యాజిక్ మంత్ర మిస్ అవ్వొద్దు
Recommended image2
Masala Vada Recipe: ఈ చిన్న సీక్రెట్ తో పర్ఫెక్ట్ మసాలా వడ
Recommended image3
Smart Kitchen Hack: రోజూ ఒకే ఫుడ్ తో బోర్ కొడుతుందా? మీకోసమే కొన్ని క్రియేటివ్ కుకింగ్ ఐడియాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved