MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Food
  • Sabja Seeds: సమ్మర్ లో సబ్జా గింజలను తీసుకుంటే ఏమౌతుంది?

Sabja Seeds: సమ్మర్ లో సబ్జా గింజలను తీసుకుంటే ఏమౌతుంది?

Sabja Seeds: వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది. దాని వల్ల మన శరీరంలోని నీరంతా బయటకు పోతుంది.బాడీ డీహైడ్రేటెడ్ అయిపోతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 17 2025, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
health benefits drinking sabja seeds water in summer

health benefits drinking sabja seeds water in summer

Sabja Seeds Water in Summer: బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలను తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఈ వేడి తట్టుకోవాలి అంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏది పడితే అది తింటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.ముఖ్యంగా శరీరంలో వేడి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో లభించే కొన్ని సహజ పదార్థాలతో తయారు చేసిన డ్రింక్ తాగాలట. వాటిల్లో సబ్జా గింజలు ముందు వరసలో ఉంటాయి. ఈ ఎండాకాలం రోజంతా శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మరి, ఈ సబ్జా గింజల నీటిని ఎలా తీసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో చూద్దామా...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
health benefits drinking sabja seeds water in summer

health benefits drinking sabja seeds water in summer

ముఖ్యంగా వేసవి కాలంలో నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరానికి కలిగే వడదెబ్బ (Sunstroke) సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ గింజలలో ఫొలేట్‌, నియాసిన్‌, విటమిన్‌ ఇ వంటి పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక ఇన్ని పోషకాలను కలిగిన సబ్జా గింజలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.

35
health benefits drinking sabja seeds water in summer

health benefits drinking sabja seeds water in summer

ఎండాకాలంలో సబ్జా గింజలతో ప్రయోజనాలు...

వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది. దాని వల్ల మన శరీరంలోని నీరంతా బయటకు పోతుంది.బాడీ డీహైడ్రేటెడ్ అయిపోతుంది. అందుకే ఈ సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. చాలా మంది వేడి తట్టుకోలేక కూల్ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉంటారు. కానీ, వాటి వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే వాటికి బదులు నీటిలో నానపెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే సరిపోతుంది.

సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.మీరు చెమట ద్వారా కొల్పోయే ఎలక్ట్రోలైట్లు, నీరు భర్తీ చేయడంలో సహాయపడుతుంది. అందుకే.. దాహం వేసిన ప్రతిసారీ  ఈ నీటిని తాగితే సరిపోతుంది. సబ్జా గింజల్లో విటమిన్ ఎ, ఇ, కె వంటి విటమిన్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్ , ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన నీరు, పోషకాలను అందిస్తాయి.  ఈ సబ్జా నీటిని తాగడం వల్లా ఎసిడిటీ సమస్యను తగ్గించడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది.
 

45

ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును (Fat) కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు డైట్ లో సబ్జా గింజలను చేర్చుకోవడం మంచిది. వాతావరణంలో మార్పుల కారణంగా కలిగే శ్వాసకోశ సమస్యల (Respiratory problems) నివారణ కోసం సబ్జా గింజల పానీయంలో కొద్దిగా అల్లం రసం, తేనే కలిపి తీసుకోవాలి. 
 

55

సబ్జా గింజలను ఎలా తినాలి?

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టీస్పూన్ల సబ్జా గింజలను సుమారు 15 నిమిషాలు నానబెట్టండి. అవి ఉబ్బి పరిమాణం పెరిగేకొద్దీ, ప్రతి నల్ల గింజ చుట్టూ జెల్లీలాగా మారుతుంది.ఇప్పుడు మీరు ఈ విత్తనాలను నిమ్మరసం, మిల్క్‌షేక్‌లు, కొబ్బరి నీరు, స్మూతీలు, మజ్జిగ, సూప్‌లు వంటి వివిధ పానీయాలకు జోడించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved