MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Food
  • ఈ విషయం తెలిస్తే సబ్జా గింజలను అస్సలు వదిలిపెట్టరు

ఈ విషయం తెలిస్తే సబ్జా గింజలను అస్సలు వదిలిపెట్టరు

తులసి విత్తనాలనే సబ్జా గింజలు అంటారు. ఇవి చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఎండాకాలంలో వీటిని పానీయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విత్తనాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడతాయి. కానీ చాలా మంది తులసి విత్తనాలు చేసే మేలు తెలియక వీటిని ఉపయోగించడం లేదు.  

2 Min read
Author : R Shivallela
Published : Oct 22 2023, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తులసి ఆకులు మనకు ఎంతటి మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. కానీ తులసి విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గింజలు నల్లగా ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా ఒసిమమ్ బాసిలికమ్ అని పిలుస్తారు. తులసి ఆకులు సాధారణంగా పాక మూలికగా ఉపయోగించబడుతున్నప్పటికీ.. దీని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ విత్తనాలతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

డైజెస్టివ్ సపోర్ట్

తులసి విత్తనాలలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని నానబెడితే జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కడుపును తొందరగా నింపుతుంది. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 

38

బ్లడ్ షుగర్ మేనేజ్ మెంట్

తులసి విత్తనాల్లో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థలో చక్కెరల శోషణ మందగించడానికి సహాయపడుతుంది. ఈ విధానం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా నిర్వహించడానికి తులసి విత్తనాలు సహాయపడుతాయి.
 

48

కూలింగ్ గుణాలు

తులసి విత్తనాలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని వేడి చేసినప్పుడు, ఎండా కాలంలో హెల్తీ పానీయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి,  రిఫ్రెష్ అనుభూతిని కలిగించడానికి సహాయపడతాయి.
 

58

పోషకాలకు మూలం

తులసి విత్తనాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు సెల్యులార్ నష్టాన్ని కూడా నివారిస్తాయి. 
 

68

ఆర్ద్రీకరణ 

తులసి విత్తనాలను నీటిలో నానబెట్టడం వల్ల అవి ఉబ్బుతాయి. శ్లేష్మ ఆకృతిని కలిగి ఉంటాయి. ఇది తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. శరీరం హైడ్రేట్ గా ఉండటానికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి. 

78

చర్మ ఆరోగ్యం

తులసి విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీరు యవ్వనంగా కనిపిస్తారు. స్కిన్ కలర్ కూడా బాగుంటుంది. 
 

88

గట్ వెల్ నెస్

తులసి విత్తనాలలో కరిగే ఫైబర్ ప్రీబయోటిక్ గా పనిచేస్తుంది. ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా మీ శరీరం ఆరోగ్యంగా, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది. 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved