సగం ఉడికించిన గుడ్డు తింటే ఏమౌతుందో తెలుసా?
గుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మనలో చాలా మంది పూర్తిగా ఉడికించిన గుడ్డునే తింటుంటారు. కానీ సగం ఉడికిన గుడ్డును తింటే ఏమౌతుందో తెలుసా?
అది ఆదివారమైన, సోమవారమైనా ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డును తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. మీకు తెలుసా? ఒక చిన్న గుడ్డులో మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
egg
ముఖ్యంగా చలికాలంలో రోజూ ఒక ఉడికించిన గుడ్డును తినడం వల్ల మనం బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఈ సీజన్ లో గుడ్డుతో వచ్చే బెనిఫిట్స్ పెరుగుతాయి. చలికాలంలో గుడ్డును తింటే జలుబు చేయదు. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మనం ఎన్నో వ్యాధులతో పోరాడగలుగుతాం. తొందరగా తగ్గించుకోగలుగుతాం. మీకు తెలుసా? గుడ్డును తింటే మన శరీరం ఎన్నో వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంటుంది.
అయితే చాలా మంది పూర్తిగా ఉడికించిన తర్వాత గుడ్డును తింటుంటారు. కానీ కొంతమంది మాత్రం సగం ఉడికించిన గుడ్డును తింటుంటారు. ముఖ్యంగా వేరే దేశాల వారు ఇలా ఎక్కువగా తింటుంటారు. మీకు తెలుసా? సగం ఉడికించిన గుడ్డును తింటే చాలా మంచిది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సగం ఉడికించిన గుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పోషకాలు ఎక్కువగా ఉంటాయి
సగం ఉడికించిన గుడ్డలో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఖనిజాలు, ప్రోటీన్లు, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం.. సగం ఉడకబెట్టిన గుడ్డులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయి. ఎందుకంటే ఈ గుడ్డులో పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అదే మనం గుడ్డును పూర్తిగా ఉడికిస్తే పోషకాల పరిమాణం తగ్గుతుందట.
ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి
పూర్తిగా ఉడికించి గుడ్డులో కంటే సగం ఉడికించిన గుడ్డులోనే ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో సగం ఉడికించిన గుడ్డును తింటే ఫైబర్, ప్రోటీన్లు బాగా అందుతాయి. నిజానికి ఈ రెండూ చలికాలంలో మన శరీరానికి చాలా అవసరం. అంతేకాదు ఇవి మన జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడానికి కూడా సహాయపడతాయి.
egg
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
పూర్తిగా ఉడికించిన గుడ్డు కంటే సగం ఉడకబెట్టిన గుడ్డే మీరు తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎలా అంటే పూర్తిగా ఉడకబెట్టిన గుడ్డును తింటే మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది. అదే సగం ఉడికించిన గుడ్డు అయితే మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సగం ఉడికించిన గుడ్లలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది
సగం ఉడికించిన గుడ్డలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడతాయి. తరచుగా సగం ఉడికించిన గుడ్లను తింటే మన రోగనిరోధక శక్తి బలంగా అవుతుంది. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
egg
అయితే సగం ఉడికించిన గుడ్లను ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. దీనివల్ల మీకు కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే సగం ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించండి. ఎందుకంటే చాలా సార్లు స్కిన్ అలర్జీ ఉన్నవారికి సగం ఉడికించిన గుడ్లు మంచివి కావు.