జుట్టు బాగా రాలుతోందా? ఇదిగో ఈ గింజలను తింటే సమస్య మాయం..!
గింజల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తింటే జుట్టు ఊడిపోవడం ఆగుతుంది. అలాగే పొడుగ్గా పెరుగుతుంది.
Image: Getty Images
గింజలు ఆరోగ్యకరమైన, టేస్టీ టేస్టీ స్నాక్స్. వీటిని సమతుల్య ఆహారంలో ఎంచక్కా తినొచ్చు. ఎందుకంటే ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. అందుకే అవి మన మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివి. గింజలు మన ఆరోగ్యానికే కాదు మన జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వారు వీటిని తింటే జుట్టు రాలే అవకాశమే ఉండదు. గింజలు జుట్టు పొడుగ్గా పెరిగేందుకు కూడా సహాయపడతాయి.
nuts
జుట్టు పెరుగుదలకు మేలు చేసే గింజలు
గింజలు ఎన్నో రకాల బి విటమిన్లు, జింక్, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ శరీరంలో లోపిస్తే మీ జుట్టు రాలడం స్టార్ట్ అవుతుంది. జుట్టు పెరుగుదలకు జింక్, సెలీనియం చాలా అవసరం. కానీ వీటిని మన శరీరాలు సొంతంగా తయారు చేయవు. కాబట్టి వీటిని ఫుడ్ ద్వారా తీసుకోవాలి. అయితే గింజల్లో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలడం ఆగాలంటే ఎలాంటి గింజలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Soaked Almonds
బాదం
మనలో చాలా మందికి బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొద్దున తినే అలవాటు ఉంటుంది.కానీ ఈ అలవాటును ఎట్టిపరిస్థితిలో ఆపొద్దు. ఎందుకంటే బాదం విటమిన్ ఇ కి మంచి మూలం. ఇది యాంటీఆక్సిడెంట్. ఇది జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది. బాదం పప్పులు బయోటిన్ కు మంచి మూలం. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన బి విటమిన్. రోజూ 15 నుంచి 20 బాదం పప్పులు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరిగి ఊబకాయం బారిన పడతారు. మీకు అలెర్జీలు, అజీర్ణం, కడుపు పూతలు వంటి సమస్యలుంటే బాదం పప్పులను తినకండి. ఒకవేళ తిన్నా లిమిట్ లోనే తినండి.
వాల్ నట్స్
వాల్ నట్స్ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి మన జుట్టును పొడుగ్గా పెంచుతాయి. వెంట్రుకలను షైనీగా చేయడానికి సహాయపడతాయి. వాల్ నట్స్ విటమిన్ ఇ, సెలీనియానికి మంచి మూలం. ఇవి రెండూ యాంటీఆక్సిడెంట్లు. వీటి నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి 6 నుంచి 8 చిన్న వాల్ నట్స్ ముక్కలను తినండి. వాల్ నట్స్ లో కేలరీలు, కొవ్వు ఉంటుంది. కాబట్టి, వీటిని అతిగా తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
బ్రెజిల్ గింజలు
జుట్టు పెరిగేందుకు సెలీనియం చాలా అవసరం. ఇది బ్రెజిల్ గింజలలో పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా రక్షించడానికి కూడా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం రోజుకు 2 నుంచి 3 బ్రెజిల్ గింజలను తినండి. ఎందుకంటే బ్రెజిల్ గింజలను ఎక్కువగా తినడం వల్ల సెలీనియం విషానికి దారితీస్తుంది. అలా జరిగితే మీకు వికారం, గోర్ల రంగు మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి.
cashew
జీడిపప్పు
జీడిపప్పులో ప్రోటీన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు అవసరం. ఇందుకోసం రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
hazelnut
హాజెల్ నట్స్
ఇవి విటమిన్ ఇ కి మంచి వనరులు. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతినకుండా రక్షించడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్. వీటిలో ప్రోటీన్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. రోజుకు 25 నుంచి 30 గ్రాముల గింజలు తీసుకుంటే సరిపోతుంది. కానీ బరువు తగ్గాలనుకునేవారు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు హాజెల్ నట్స్ తినకూడదు.