MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Grapes: నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష.. రెండింటిలో ఏది మంచిది? ఎవరు ఏది తినాలో తెలుసా?

Grapes: నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష.. రెండింటిలో ఏది మంచిది? ఎవరు ఏది తినాలో తెలుసా?

 Grapes: మీకు ద్రాక్ష పండ్లు తినడం ఇష్టమా? ఏ రంగు ద్రాక్ష పండ్లు తింటున్నారు..? నలుపు ద్రాక్ష లేదా ఆకు పచ్చ రంగులో ఉండే ద్రాక్షా..? ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 24 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Green Grapes vs Black Grapes
Image Credit : Getty

Green Grapes vs Black Grapes

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే పండ్లలో ద్రాక్ష ముందు వరసలో ఉంటుంది. ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే.. మనకు మార్కెట్లో చాలా రకాల ద్రాక్ష పండ్లు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్ష, ఆకు పచ్చ ద్రాక్ష ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటినే ఎక్కువ మంది తింటూ ఉంటారు. మరి.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఏవి తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? ఏ రంగు ద్రాక్ష ఎవరు తినాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నల్ల ద్రాక్ష Vs ఆకు పచ్చ ద్రాక్ష..
Image Credit : AI Meta

నల్ల ద్రాక్ష Vs ఆకు పచ్చ ద్రాక్ష..

ఈ రెండు రకాల ద్రాక్ష పండ్ల్లోనూ విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్షలో ఆంథోసయనినట్లు, రెస్వెరాట్రాల్ వంటి మరింత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేయడంలోనూ హెల్ప్ చేస్తాయి. మరోవైపు, పచ్చ ద్రాక్ష పండ్లలో కేలరీలు, చక్కెర కొద్దిగా తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలి అనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.

యాంటీ ఆక్సిడెంట్లు...

నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ ద్రాక్షలో ఆంథోసయనిన్ సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో, గుండె సంబంధిత సమస్యలు తగ్గించడానికి సహాయపడతాయి. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్.. గుండె ఆరోగ్యానికి సహాయపడి.. ఆయుష్షు పెంచడానికి హెల్ప్ చేస్తాయి.

రుచి, ఆకృతి...

పచ్చ ద్రాక్ష సాధారణంగా గట్టిగా, తినడానికి అనువుగా, కొద్దిగా పుల్లగా, తియ్యగా ఉంటాయి. ఇవి సలాడ్లు, స్నాక్స్ కి బాగుంటాయి. అయితే, నల్ల ద్రాక్ష తియ్యగా,మృదువుగా ఉంటాయి. డెజెర్ట్స్ , ఇతర వంటలకు, జ్యూస్ కి అనుకూలంగా ఉంటాయి.

విటమిన్ సి...

ఈ రెండు రకాల ద్రాక్షల్లో విటమిన్ సి ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే, నల్ల ద్రాక్షలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

జీర్ణక్రియ, హైడ్రేషన్..

ద్రాక్ష పండ్లలో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. పచ్చ ద్రాక్ష తినప్పుడు మీ కడుపు తేలికగా అనిపించొచ్చు. నల్ల ద్రాక్షలో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

33
  ఈ రెండింటిలో ఏది బెస్ట్..?
Image Credit : Getty

ఈ రెండింటిలో ఏది బెస్ట్..?

ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే.. మీకు యాంటీ ఆక్సిడెంట్లు , దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే నల్ల ద్రాక్ష ఎంచుకోవాలి. మీరు కొద్దిగా పుల్లగా, తక్కువ చక్కెర ఉన్నవి కావాలి అంటే.. గ్రీన్ గ్రేప్స్ ఎంచుకోవడం ఉత్తమం. అయితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. ద్రాక్ష మితంగా తినడమే మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పక్కన ఈ మొక్కలు ఉంటే మీకే నష్టం..!
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి నల్లగా మారిందా? ఇలా చేస్తే రెండు రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved