గోల్డెన్ మిల్క్ : ఒక్కసారి తాగితే మామూలు పాలు మరిచిపోతారు..
చాలా తక్కువ పదార్ధాలతో, అతి తక్కువ సమయంలో తయారు చేసే హెల్తీ డ్రింక్ గోల్డెన్ మిల్క్. దీన్నే హల్ది వాలా దూధ్ అని కూడా పిలుస్తారు. సింపుల్ గా ఉండే ఈ రెసిపీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చాలా తక్కువ పదార్ధాలతో, అతి తక్కువ సమయంలో తయారు చేసే హెల్తీ డ్రింక్ గోల్డెన్ మిల్క్. దీన్నే హల్ది వాలా దూధ్ అని కూడా పిలుస్తారు. సింపుల్ గా ఉండే ఈ రెసిపీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రాత్రి పడుకునేముందు, భోజనం తరువాత ఈ గోల్డెన్ మిల్స్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ రెసిపీలో పాలు, పసుపు, బెల్లం, దాల్చినచెక్క ఏలకులు వాడతారు. మీకు కావాలంటే పాలల్లో కుంకుమ, అల్లం, నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చు.
గోల్డెన్ మిల్క్ జలుబు, దగ్గులకు తక్షణ ఉపశమనంగా పనిచేస్తుంది.
గోల్డెన్ మిల్క్ తయారీకి కావల్సిన పదార్థాలు
1 1/4 కప్పు పాలు
1 ఆకుపచ్చ ఏలకులు
1/2 టీస్పూన్ పసుపు
1 టీస్పూన్ బెల్లం పొడి
1 ముక్క దాల్చినచెక్క
గోల్డెన్ మిల్క్ తయారు చేసే విధానం..
ఓ గిన్నెలో పాలు తీసుకుని స్టౌ మీద పెట్టి, దీంట్లో దాల్చిన చెక్క, యాలకుల పొడి వేసి మరగనివ్వండి.
ఇప్పుడు మరుగుతున్న పాలలో బెల్లం పొడి, పసుపు వేసి బాగా కలపండి.
తరువాత మంట తగ్గించి కప్పున్నర పాలు.. కప్పు అయ్యేవరకు మరగనివ్వాలి.
అంతే తరువాత స్టౌ ఆఫ్ చేసి, పాలను కప్పులో పోసి తాగేయడమే.
అంతే తరువాత స్టౌ ఆఫ్ చేసి, పాలను కప్పులో పోసి తాగేయడమే.