ఈ పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది జాగ్రత్త
డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పుచ్చకాయ
పుచ్చకాయ మంచి హెల్తీ ఫుడ్, దీనిలో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. కానీ ఈ పండును షుగర్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే ఈ పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండును డయాబెటీస్ ఉన్నవారు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి.
పైనాపిల్
పైనాపిల్ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో నేచురల్ షుగర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అందుకే ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తారు.
అరటిపండు
అరటి మంచి హెల్తీ పండు. కానీ ఈ పండులో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. ఈ పండును తింటే డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా తినకూడదు.
మామిడి పండు
చాలా మంది మామిడి పండును చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈ పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి.
ద్రాక్ష
ద్రాక్షలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో షుగర్ కూడా ఎక్కువగానే ఉంటుది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ద్రాక్షలను ఎక్కువగా తినకూడదు.
చెర్రీలు
చెర్రీలు టేస్టీగా ఉంటాయి. కానీ ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని డయాబెటీస్ పేషెంట్లకు తినకూడదు. ఒకవేళ తింటే రక్తంటో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 64 ఉంటుంది. అంటే వీటిలో నేచురల్ షుగర్స్ బాగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఎండుద్రాక్షల్ని ఎక్కువగా తినకూడదు.