ప్రెజర్ కుక్కర్ లో ఈ ఫుడ్స్ వండుతున్నారా? చాలా ప్రమాదం తెలుసా?
తొందరగా అవుతోంది కదా అని అన్ని రకాల వంటలు ప్రెజర్ కుక్కర్ లో చేయకూడదు. అలాంటి వంటకాలేంటో ఓసారి చూద్దాం...
pressure cooker
దాదాపు అందరు ఇళ్లల్లో ప్రెజర్ కుక్కర్ ఉంటుంది. ఇవి ఉండటం వల్ల వంట చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోదు. దీంతో.. అందరూ వీటినే వాడుతూ ఉంటారు. కానీ.. మీకు తెలుసా ప్రెజర్ కుక్కర్ లో అన్ని రకాల వంటలు చేయకూడదని. మీరు చదివింది నిజమే. తొందరగా అవుతోంది కదా అని అన్ని రకాల వంటలు ప్రెజర్ కుక్కర్ లో చేయకూడదు. అలాంటి వంటకాలేంటో ఓసారి చూద్దాం...
sea food
1.చేపలు..
చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలో ఉంటే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంత ఆరోగ్యకరమైన చేపలను చాలా మంది పులుసుగా వండుతున్నారు. అయితే.. పొరపాటున కూడా వీటిని ప్రెజర్ కుక్కర్ లో వండకూడదు. ఎందుకంటే.. ప్రెజర్ కుక్కర్ లో వండటం వల్ల.. చేప మరీ ఓవర్ గా కుక్ అవుతుంది. రుచి పాడౌతుంది.
2.పాస్తా..
పాస్తాను ఈ కాలం పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే.. పాస్తాను పొరపాటున కూడా ప్రెజర్ కుక్కర్ లో ఉడకపెట్టకూడదు. ఎందుకంటే.. ప్రెజర్ కుక్కర్ లో వండటం వల్ల దాని కనిసిస్టెన్సీ మారిపోతూ ఉంటుంది. దీనిని పాన్ లో వండటమే ఉత్తమం.
Image: Getty Images
3.డెయిరీ ఫుడ్స్..
ఎలాంటి డెయిరీ ఫుడ్స్ ని కూడా పొరపాటున కూడా ప్రెజర్ కుక్కర్ లో వండకూడదు. ప్రెజర్ కుక్కర్ లో కుక్ చేయడం వల్ల... వాటి రుచి, టెక్చర్ మొత్తం మారిపోతుంది.
4.బ్రెడ్ ఫుడ్స్..
బ్రెడ్ తో తయారు చేసే ఫుడ్స్ కి కూడా ప్రెజర్ కుక్కర్ వాడకూడదు. ఒకవేళ కోటింగ్ కి వాడే బ్రెడ్ క్రమ్బ్స్ అయితే.. క్రిస్పీ గా రావు. కాబట్టి.... వీటిని కూడా ప్రెజర్ కుక్కర్ లో ఉపయోగించకూడదు.
5.ఫ్రూట్స్..
దాదాపు చిన్న పిల్లలకు తినిపించడానికి కొందరు పండ్లను కుక్కర్ లో ఉడకపెట్టి.. ఆ తర్వాత తినిపిస్తూ ఉంటారు. అలా చేయవచ్చు. కానీ... ఏదైనా డిసర్ట్ చేయడానికి ఫ్రూట్స్ ని కుక్కర్ లో ఉడకపెట్టకూడదు. దాని వల్ల.. అవి మరీ మెత్తగా పేస్టులా మారి.. రుచిని కోల్పోతాయి.