మటన్ ను ఇలా మాత్రం తినకూడదు
ప్రతి సండే మటన్ ను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే మటన్ ను తినేటప్పుడు కొన్ని ఆహారాలను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే?
ఆహారపు అలవాట్ల గురించి ఆయుర్వేదం ఎన్నో విషయాలను చెప్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. మాంసాహారంతో కొన్ని ఆహారాలను కలిపి అస్సలు తినకూడదు. లేదంటే మీరు ఎన్నో సమస్యల బారిన పడతారు. అందుకే మటన్ ను తింటే వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాల ఉత్పత్తులు:
మటన్ తో పాటుగా పాల ఉత్పత్తులను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చాక్లెట్ కలిపిన పాలు తాగడం, పాలు తాగిన తర్వాత చాక్లెట్ తినడం లాంటివి కూడా చేయకూడదు. అలాగే బీన్స్, ఆలుగడ్డలు లాంటి ఆహారాలను కూడా పాల ఉత్పత్తులతో తినకూడదు. అలాగే పాలు, అరటిపండు కాంబినేషన్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
బీన్స్:
బీన్స్ మంచి హెల్తీ కూరగాయ. దీనిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే బీన్స్ తినేటప్పుడు చికెన్, మటన్, బీఫ్, గుడ్డు, చేపలు వంటి మాంసాహారాలను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతో తినకూడనివి:
పెరుగును తినేటప్పుడు కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా కీరా. ఎందుకంటే కీరా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పెరుగుతో మీరు కీరాను తింటే మీకు నీరసం వస్తుంది. అలాగే పెరుగును ఎండుచేపలు తినేటప్పుడు కూడా తినకూడదు. పెరుగును తిన్న రోజు మామిడి పండ్లను కూడా తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు.
నువ్వుల నూనె:
మటన్, చికెన్, చేపల కూరను నువ్వుల నూనెతో వండితే మంచి వాసన వస్తుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది. కానీ నువ్వుల నూనెతో మాంసాహారం వండకూడదు. అలాగే మటన్ వంటి మాంసంలో వెనిగర్ కూడా వేయకూడదు.
మటన్ + పాలు - ప్రమాదం
మటన్ , పాలు రెండూ ప్రోటీన్లకు మంచి వనరులు. అయితే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినకూడదంటారు. అంటే మటన్ తిన్న తర్వాత పాలను అస్సలు తాగకూడదు.
మీరు మటన్ తిని, అదేరోజు పాలను తాగితే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మటన్ తిన్న తర్వాత పాలు తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. మనం తిన్న ప్రతీది జీర్ణం కావడానికి, పోషకాలను శరీరం శోషించుకోవడానికి కొంత సమయం కావాలి. అందుకే పాలు తాగిన తర్వాత చికెన్, మటన్, చేపలు వంటి మాంసం తినకూడదంటారు.
పాలతో మటన్ లాంటి మాంసాహారం తింటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మటన్, చికెన్, చేపలు వంటి మాంసాహారం తిని పాలు తాగితే మీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మటన్ తిని పాలు తాగితే లాక్టోస్ ఇన్టాలరెన్స్ సమస్య వస్తుంది. ఫుడ్ పాయిజన్ సమస్య కూడా వస్తుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం..మటన్, పాలు కలిపి తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. దీనితో బీపీ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇక నుంచి మటన్ తిన్నప్పుడు పాలలను తాగకండి. మటన్ ఒక్కటి తింటే మీ శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.