కోపం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
కొంతమందికి చిన్న చిన్న విషయాలకు కూడా కోపమొస్తుంటుంది. ఇలాంటి వారు ప్రతి దానికి కోప్పడుతూనే ఉంటారు. ఈ కోపం వల్ల మీతో సరిగ్గా ఎవ్వరూ మాట్లాడలేరు. అంతేకాక కోపం మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మీ కోపాన్ని మరింత పెంచుతాయి. అందుకే వీటిని తినకుండా ఉండాలి. అవేంటంటే.
మన భావోద్వేగాలకు.. మనం తినే ఆహారాలకు సంబంధం ఉంటుందని నిపుణులు చెప్తారు. కొన్ని రకాల ఆహారాలు మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపితే.. మరికొన్ని ఆహారాలు మాత్రం చెడు ప్రభావాన్నిచూసపుతాయి. మీకు కోపం ఎక్కువున్నా? కోపంలో ఉన్నా కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే ఇవి మీ కోపాన్ని మరింత పెంచుతాయి. మరి కోపం పెరగకుండా ఉండేందుకు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
processed food
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని రోజూ తినేవారున్నారు. కానీ ప్రాసెస్ చేసిన ఫుడ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, సంకలనాలు, సంరక్షణకారులు ఉంటాయి. ఇవి మీ న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అలాగే మీ మానసిక స్థితి, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ ఒంట్లో శక్తి తగ్గుతుంది. ఇది కోపాన్ని కూడా పెంచుతుంది.
షుగర్ రిచ్ ఫుడ్స్
షుగర్ రిచ్ ఫుడ్స్ కూడా కోపాన్ని పెంచుతాయి. క్యాండీలు, చాక్లెట్లు, తియ్యటి పానీయాలు, స్వీట్లతో పాటుగా చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకును కలిగిస్తుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
Image: Freepik
కెఫిన్
కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఈ లీస్ట్ లో ఉన్నాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని కొన్ని సార్లు ఆందోళన, ఒత్తిడి, కోపం పెరగడం వంటి మానసిక సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకూడదు.
Image: Getty
ఉప్పు
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా కోపాన్ని పెంచుతాయి.ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, స్నాక్స్ మొదలైన వాటిని ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి కోపం బాగా పెరుగుతుంది. అందుకే ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి.
spicy foods
స్పైసీ ఫుడ్స్
స్పైసీ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో కోపం లేదా ఒత్తిడి భావనలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్
ఆల్కహాల్ కూడా కోపాన్ని పెంచుతుంది. మందును ఎక్కువగా తాగేవారిలో కోపం, మానసిక సమస్యలు బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మందు తాగే అలవాటును తగ్గించుకోండి. కోపం కూడా తగ్గుతుంది.