జ్వరం, దగ్గు, జలుబు.. వర్షాకాలంలో వీటిని తింటే ఈ సమస్యలే రావు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో వ్యాధులు వస్తాయి. అందుకే ఈ సీజన్ లో కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
immunity boosting foods
వర్షాకాలంలో మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి జ్వరం, దగ్గు, జలుబు వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ డైట్ లో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
యాపిల్స్
యాపిల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ పండ్లను తింటే హాస్పటల్లకు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు.
బొప్పాయి
బొప్పాయి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి బొప్పాయిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
Image: Getty
పసుపు
పసుపులో ఉండే కర్కుమిన్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. అయితే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పసుపును కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.
వెల్లుల్లి
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే వెల్లుల్లి కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబును తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి.
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్య కూడా బాగుంటుంది. అంతేకాదు ఇది మీ లైంగిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
బెల్ పెప్పర్
బెల్ పెప్పర్ లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. గ్రీన్ పెప్పర్, స్వీట్ పెప్పర్, బెల్ పెప్పర్ అని పిలువబడే క్యాప్సికమ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కూరగాయ. క్యాప్సికమ్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.